Ads
ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. పైగా చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి, బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది.
Video Advertisement
ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, క్రితి శెట్టి బాగా నటించారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎందుకు బ్రహ్మానందాన్ని పెట్టలేదు అని అభిమానులు ప్రశ్నించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బ్రహ్మానందం మంచి హాస్యాన్ని పండించారు. అయితే ఈ సినిమాలో లేక పోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది.
అయితే ఈ సినిమాలో బ్రహ్మానందంని ఎందుకు పెట్టలేదు అన్న దానిపై నాగార్జున మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ బంగార్రాజు చిత్రాన్ని సోగ్గాడే చిన్నినాయన కథ జరిగిన 30 సంవత్సరాల తర్వాత ఉన్నట్లు తీశారు. అయితే బ్రహ్మానందాన్ని కనుక ఈ సినిమాలో చూపించాలంటే 80 ఏళ్ల వయసున్న వ్యక్తిగా పాత్ర ఇవ్వాలి. అప్పుడు ఇదంతా పెద్ద కథ అయిపోతుంది. అందుకే బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందానికి పాత్ర ఇవ్వలేదు అని నాగార్జున అన్నారు.
End of Article