Ads
మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక్. తన తాత గారి సినిమాల్లో బాల నటుడిగా నటించి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో సెటిలైపోయాడు.
Video Advertisement
ఇక సీనియర్ ఎన్టీఆర్ అయితే పౌరాణిక చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో పాతాళభైరవి కూడా ఒకటి. 1951లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. నందమూరి తారక రామారావు గారి తో పాటు ఎస్ వి రంగారావు, కే మాలతి కూడా ప్రధాన పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు.
1951, మే 17 న ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రం ఏకంగా 200 థియేటర్లలో ఆడి రికార్డులను సృష్టించింది. అయితే ఈ చిత్రాన్ని చేయాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాడు. పైగా ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు అనే ప్రకటన కూడా వచ్చింది. కానీ సినిమా ఆగిపోయింది.
దీనికి గల కారణం ఏమిటంటే ఎంతో మంది ప్రముఖ దర్శకులు ఈ సినిమా గురించి విమర్శలు చేశారు. పైగా ఈ తరం వాళ్ళకి ఈ సినిమా నచ్చదని విమర్శలు కూడా చేశారు. దీని కారణంగానే తారక్ కూడా ఈ సినిమాలో నటించడానికి వెనుకడుగు వేయడం జరిగింది.
End of Article