అందుకే నాగ చైతన్య “థాంక్యూ” మళ్లీ వాయిదా పడిందా..?

అందుకే నాగ చైతన్య “థాంక్యూ” మళ్లీ వాయిదా పడిందా..?

by Anudeep

Ads

అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని “మనం” రూపంలో అందించాడు విక్రమ్ కుమార్. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో “హలో” చేసాడు.

Video Advertisement

ఇప్పుడు నాగ చైతన్యతో “థాంక్యూ” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ విక్రమ్. ఇందులో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ అవికా గోర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

థాంక్యూ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మొదట ఈ మూవీని జులై 8న విడుదల చేయాలని నిర్ణయించారు కానీ మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జులై 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. విడుదల ఆలస్యానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని టాక్. ఇతర పెద్ద సినిమాల్లో థమన్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ఆర్ ఆర్ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం.

ఆల్రెడీ ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మారో’ ‘ఏంటో ఏంటేంటో’… వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు. ‘జోష్’ తర్వాత సుమారు 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత దిల్ రాజు- నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా థాంక్యూ. ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ లో బిజీ గా ఉండగా, రాశీఖన్నా జులై 1న గోపిచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ తో రానుంది.


End of Article

You may also like