తన కొడుకు ఎంగేజ్మెంట్ కి వైఎస్ షర్మిల ప్రత్యర్ధులను కూడా ఎందుకు ఆహ్వానించారు..? కారణం ఇదేనా..?

తన కొడుకు ఎంగేజ్మెంట్ కి వైఎస్ షర్మిల ప్రత్యర్ధులను కూడా ఎందుకు ఆహ్వానించారు..? కారణం ఇదేనా..?

by kavitha

Ads

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం త్వరలో జరుగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి నిశ్చితార్ధం వేడుక జరుగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.

Video Advertisement

బుధవారం నాడు షర్మిల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను ఆయన నివాసంలో కలిసి, కుమారుడు  వివాహానికి ఆహ్వానిస్తూ పెళ్లి పత్రిక అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులను షర్మిల ఎందుకు ఆహ్వానించారు. దాని వెనుక కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు న్యూస్18 కథనం ప్రకారం, కొన్ని రోజుల క్రితం వరకు తెలంగాణ ఎలక్షన్స్ లో అధికార పార్టీ పై పోటీకి సిద్ధం అయిన వైఎస్‌ షర్మిల, హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని తన పార్టీని హస్తంలో విలీనం చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని పొందారు. జగన్ వద్దనుకున్న పార్టీలో జాయిన్ అవడం, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అవడం, జగన్ ప్రత్యర్ధులను స్వయంగా కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించడం చూసిన వారంతా అన్న జగన్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని అంటున్నారు.
షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి  ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ కు అతీతంగా పలువురు రాజకీయ నేతలను కలిసి నిశ్చితార్ధంతో పాటు వివాహం, రిసెప్షన్‌కి కూడా ఆహ్వానిస్తున్నారు. ముందుగా అన్న జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అన్న జగన్ కు ప్రత్యర్థులు అయిన టిడిపి అధినేత చంద్రబాబును షర్మిల కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పడం.
జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం చూస్తుంటే అన్న జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుతో భేటీని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

Also Read: వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్, పెళ్లి పత్రికలు చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?


End of Article

You may also like