Ads
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రక్షణ దళాల ప్రధాన అధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.
Video Advertisement
ఈ వార్తతో యావత్ దేశం షాక్ లో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ దుర్ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా.. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో ఉండే దట్టమైన మంచు కారణంగానే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ దుర్ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. మై న్యూస్ వింగ్స్ కధనం ప్రకారం… రక్షణ దళాల ప్రధాన అధిపతి ప్రయాణిస్తున్నారు అంటే ఆ హెలికాప్టర్ ను పూర్తిగా తనిఖీ చేసిన తరువాత కానీ నడపరు. ఈ హెలికాప్టర్ లో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ఈ హెలికాప్టర్ రష్యాకు చెందిన ఖజన్ హెలికాప్టర్స్ లో rassi a రకానికి చెందిన హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ను తొమ్మిదేళ్ల క్రితం భారత వైమానిక దళంలోకి తీసుకున్నారు.
ఈ హెలికాప్టర్ టేక్ ఆఫ్ సమయంలోనే కనీసం పదమూడు వేల కిలోల బరువుని సైతం మొయ్యగలదు. వీటిని MI17 – V5 గా వ్యవహరిస్తారు. ఇవి 36 మంది సైనికులతో పాటు వారికి అవసరమైన సరుకులను కూడా తీసుకుపోగలుగుతాయి. ప్రధానమంత్రి, హోమ్ మినిష్టర్ కార్యాలయాల పనుల కోసం కూడా వీటిని వినియోగిస్తారు. రెండేళ్ల క్రితమే ఈ హెలికాప్టర్లను రష్యా సర్వీసింగ్ చేసి ఇచ్చింది.
ఈ హెలికాప్టర్ లపై ఆయుధాలను ప్రయోగించినా.. లోపల సైనికులను రక్షించగల బులెట్ ప్రూఫ్ సామర్ధ్యం వీటికి ఉంటుంది. ఒకవేళ హెలికాప్టర్ లోనే పేలుడు సంభవించే పరిస్థితి ఎదురైతే అందుకు అవసరం అయిన పోలీ యురిత్రేనే ఫోమింగ్ సిస్టం ను కూడా కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఈ హెలికాప్టర్ జామర్లను కూడా కలిగి ఉంటాయి. వీటికి S8 రాకెట్లు, క్షిపణులు, 23 ఎంఎం మిషన్ గన్స్ ను కూడా అమర్చి ఉంచుతారు. ఇంత పకడ్బందీగా ఉన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరం. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు, చర్చలకు తావిస్తోంది.
End of Article