కృష్ణంరాజు చనిపోవడం వెనక అసలు కారణాన్ని వెల్లడించిన వైద్యలు…

కృష్ణంరాజు చనిపోవడం వెనక అసలు కారణాన్ని వెల్లడించిన వైద్యలు…

by Anudeep

Ads

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు ఇక లేరు అనే వార్త తెలుగు చిత్రసీమను కలవరపరిచింది. ఆయన మృతి పట్ల ఎందరో రాజకీయ మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియపరిచారు. అసలు ఇంతకీ కృష్ణంరాజు ఎందుకు చనిపోయారు అనేదానిపై ఆయనకు చికిత్స అందించిన ఏఐజీ హాస్పిట‌ల్ బృందం క్లారిటీ ఇచ్చారు.

Video Advertisement

డయాబెటిస్‌, క‌రోన‌రి హార్ట్ డిసీజ్‌ తో కృష్ణంరాజు బాధపడినట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన గుండె కొట్టుకునే వేగం త‌గ్గింద‌ని దానివల్ల రక్తప్రసరణలో వచ్చిన సమస్య కారణంగా కొన్నాళ్ల క్రితం ఆయన కాలికి శాస్త్ర చికిత్స జరిగిందని డాక్టర్లు పేర్కొన్నారు. అంతకుముందే ఆయనకు కిడ్నీ మరియు లంగ్ సమస్యలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో పోస్ట్ కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆరోగ్య‌ప‌ర‌మైన సమస్యల వల్ల ఆయన గత నెల 5 న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని వైద్యులు తెలిపారు.

అప్పటికే మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ బాక్టీరియా కార‌ణంగా ఆయన ఊపిరితిత్తుల్లో బాగా నిమోనియా చేరిందని. ఆయన కిడ్నీ కూడా పూర్తిగా దెబ్బ‌తిన‌టంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చామని వెల్లడించారు. అయితే ఈరోజు తెల్లవారుజాము న సడన్గా గుండెపోటు
రావ‌టంతో ఆయన క‌న్నుమూశార‌ని ఏఐజీ వైద్యులు స్పష్టం చేశారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఈయన జనవరి 20వ తారీకు 1940లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. మొట్టమొదటిసారిగా 1966 లో చిలకా గోరింకా చిత్రంతో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం లో 180 కి పైగా చిత్రాలలో నటించి అందరినీ మెప్పించారు. ఈ మేటి తారకు సినీ పరిశ్రమ కన్నీటి వీడ్కోలు పలికింది. సోమవారం హైదరాబాదులో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి: నిజంగా కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే కన్ను మూశారా…….?


End of Article

You may also like