Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.
Video Advertisement
అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. కొంత మంది మాత్రం, “అసలు సినిమా ఇంకా చాలా బాగుంటుంది అని ఊహించామని” అంటున్నారు. పుష్ప టాక్ ఇలా రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: అప్పుడు “సుకుమార్” మహేష్ కి చెప్పింది “పుష్ప” కథేనా.? మహేష్ అందుకే “నో” చెప్పారా.?
#1 సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకోవడం. అల్లు అర్జున్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్లకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే, తన కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ గా పుష్ప సినిమా నిలిచింది. అంత బాగా నటించారు. కానీ కథ పరంగా మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సాధారణంగా సుకుమార్ సినిమాలంటే కథాపరంగా చాలా బలంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు చాలా వరకు పక్కనపెట్టి సినిమాలు తీస్తారు. ఈ సినిమాలో కూడా అలానే ఉంటుంది అని అనుకున్నారు. కానీ కథ మాత్రం అంతకు ముందు మనం చాలా సార్లు చూసిన సినిమాలకి దగ్గరగా ఉంది.
#2 ఈ సినిమాని రెండు భాగాలుగా తీయాలి అనే ఉద్దేశంతో మొదటి భాగంలో ఎక్కువ కథ చెప్పలేరు. ఎక్కువ వరకు పాత్రలను పరిచయం చేయడం అనే విషయం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. దాంతో సెకండాఫ్ చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. దాని బదులు కొంత అనవసరమైన సీన్స్ ఎడిట్ చేసి కథ మొత్తం ఒకటే సినిమాలో చెప్పేయొచ్చు.
#3 సినిమాలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. వారి గెటప్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు వారు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ భాషలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కానీ చాలా వరకు పాత్రలని పూర్తిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. వారి మేక్ఓవర్ మీద పెట్టిన శ్రద్ధ ఆ పాత్రని చూపించే విధానంపై పెట్టలేదేమో అనిపిస్తుంది.
#4 సినిమాకి పాటలు ఒక ముఖ్య హైలైట్ గా నిలిచాయి. అసలు సినిమాపై అంచనాలు ఇంకా పెరగడానికి పాటలే ఒక ముఖ్య కారణం. అలాంటిది ఈ పాటలని తెరపై చూస్తున్నప్పుడు పిక్చరైజేషన్ లో ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇది మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉండేదేమో అని అభిప్రాయపడుతున్నారు.
#5 సినిమా నేటివిటీ అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. తెలుగుతోపాటు తమిళ్, అలాగే కన్నడ, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియన్ భాషల్లో సినిమాకి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమా హిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. పాన్ ఇండియన్ రిలీజ్ గా కాకుండా కేవలం దక్షిణాది భాషలకు మాత్రమే పరిమితం అవ్వాల్సిందేమో.
ఈ కారణాల వల్లే సినిమా టాక్ మిక్స్డ్ గా వస్తోంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
End of Article