Ads
చాలా మంది దాంపత్య జీవితానికి స్వస్తి పలికేసి విడాకులు తీసుకుంటారు. ఏళ్ళ తరబడి చాలా మంది విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు విడాకులు తీసుకోవడానికి వెనక కొన్ని బలమైన కారణాలు ఉండొచ్చు. అయితే అందరి జీవితం లో ఒకే కారణం మూలంగా విడాకులు తీసుకోరు.
Video Advertisement
వారి మధ్య కలిగే సమస్యల ఆధారంగా ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఈ కారణాల మూలంగానే విడాకులు తీసుకుంటున్నారు. మరి ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
#1. పార్ట్నర్ కంటే వాళ్లే బెస్ట్ అని అనుకోవడం:
చాలా మందిలో ఇది ఉంటుంది. జీవిత భాగస్వామి కంటే నేనే బెస్ట్ అని అనుకుంటూ ఉంటారు ఈ అహంభావం కారణంగా విడిపోవలసి వస్తోంది. ఎందుకు నేను నాకు తగ్గ వ్యక్తిని పెళ్లి చేసుకో లేదు నా కన్నా పై స్థాయిలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. ఈ అహంభావం వల్ల చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు.
#2. స్వేచ్ఛ లేకపోవడం:
వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం వలన కూడా విడాకుల దాకా తీసుకెళ్తున్నారు. అయితే నిజానికి కొంత మంది కెరీర్ ని భర్తలు తొక్కేస్తున్నారు దీని మూలంగా మహిళలు సఫర్ అవుతుంటారు. చిన్నప్పట్నుంచీ చదువుకున్న చదువు.. కన్న కలలు అన్నీ కూడా ఒకేసారి కూలిపోతున్నట్టు అనిపిస్తుంది ఇది విడాకులకు కారణం అవుతుంది.
#3. అంచనాలను రీచ్ అవ్వకపోవడం:
పెళ్లి తర్వాత ఇలా ఉంటాను అలా ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. వాటిని రీచ్ అవ్వక పోతే బాధ పడి విడాకుల వరకూ వెళ్తుంటారు.
#4. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం:
భార్యా భర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలన కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు బాగా తీవ్రంగా ఉంటే విడాకులు తీసుకుంటారు.
#5. అవసరాలను తీర్చలేకపోవడం:
సొంత అవసరాలని కోరికలని తీర్చని భాగస్వామి దొరికితే కూడా ఇబ్బందులు వస్తాయి ఈ కారణం వల్ల కూడా చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. విడాకులు తీసుకుంటున్నారు.
End of Article