నిజాయితీగా ప్రేమించినా ఎందుకు రిజెక్ట్ చేస్తారో తెలుసా? 5 ప్రధాన కారణాలు ఇవే..!

నిజాయితీగా ప్రేమించినా ఎందుకు రిజెక్ట్ చేస్తారో తెలుసా? 5 ప్రధాన కారణాలు ఇవే..!

by Mounika Singaluri

Ads

ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన అనుభూతి. నిజమైన ప్రేమకు వ్యామోహానికి మధ్య చాలా తేడా ఉంటుంది కానీ నేటి తరం యువత వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటూ మోసపోతుంటారు. నిజమైన ప్రేమను కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందంగా ఒక వ్యక్తి కనిపిస్తే చాలు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటూ చెప్పుకొస్తారు. మరి కొందరు మాత్రం అసలు ప్రేమకే దూరంగా ఉంటూ ఉంటారు. తమ జీవితంలో అసలు ప్రేమకి చోటు లేదని చెబుతుంటారు.

Video Advertisement

తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తులు ఎంత నిజాయితీగా ప్రేమించినప్పటికీ.. వీరు వారి ప్రేమని ఒప్పుకోరు. ఎంత ప్రేమించినా.. ఆరాధించినా అసలు పట్టించుకోరు. ప్రేమకు తమ జీవితంలో చోటు లేదని చెబుతుంటారు. అయితే దీని వెనుక కొన్ని కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

love reject

1. జీవితంలో ఒకసారి ప్రేమించి మోసపోయిన వారు ఎక్కువగా ప్రేమని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ప్రేమలో విఫలం అయిన తరువాత తిరిగి ప్రేమించడానికి వీరు ఇష్టపడరు. ఇటువంటి వారే ఎక్కువగా ప్రేమని రిజెక్ట్ చేస్తుంటారు.
2. ఇంట్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్న వారు కూడా ప్రేమ దోమలకు తమ జీవితంలో చోటు ఇవ్వకూడదని నిర్ణయించుకుంటారు. అందుకే ఎంతగా ప్రేమించినప్పటికీ.. వీరు నిజమైన ప్రేమకి దూరంగానే మసలుతుంటారు.

love reject 1

3. ప్రేమించే వారిలో లోపాలు వెతికేవారు ఎక్కువగా సింగల్ గా మిగిలిపోతుంటారు. ఏ చిన్న లోపం కనిపించినా.. వీరు వారిని దూరం పెట్టేస్తుంటారు. ప్రేమపై తమకు ఆసక్తి లేదని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు.
4. కొందరు తమ తల్లితండ్రులే లోకంగా బతుకుతూ ఉంటారు. ప్రేమ పేరుతో మరొకరికి దగ్గరై.. తల్లితండ్రులను ఇబ్బంది పెట్టడం వీరికి నచ్చదు. అందుకే ఇటువంటి వారు కూడా ప్రేమని రిజెక్ట్ చేస్తుంటారు.


5. కొందరిలో ప్రేమ అంటే ఒకరకమైన ఆందోళన ఉంటుందట. ఎవరు ప్రేమిస్తున్నాం అని చెప్పినా.. గందరగోళానికి గురి అవుతారట. ఇవన్నీ తమకి అవసరమా అనే ఉద్దేశ్యంతో ప్రేమని రిజెక్ట్ చేస్తారట.

 


End of Article

You may also like