Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిపోయింది. దీనితో ఫాన్స్ ఆనందంతో సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు వేశారు.
Video Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మార్నింగ్ షో నుండి ఈ సినిమా అలరిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.
#1 భీమ్లా నాయక్ అనే ఒక గిరిజన ఎస్సై పాత్ర చేశారు పవన్ కళ్యాణ్. ఒక ట్రైబల్ రోల్ చేయడం అనేది కాస్త స్పెషల్ గా ఉంది.
అలానే ఇది పవన్ కళ్యాణ్ కి రెండవ మల్టీ స్టారర్ సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటించారు. అది కూడా స్పెషల్. బాహుబలి తర్వాత రానాకి అంత మంచి రోల్ పడింది అని ప్రేక్షకులు అంటున్నారు.
#2 మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఉన్న ‘లాలా భీమ్లా’ అనే పాటను త్రివిక్రమ్ రాశారు. అలానే దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే, మాటలు కూడా త్రివిక్రమ్ అందించారు. పైగా అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. అంతే కాకుండా త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే క్రేజ్ ఇంకా ఎక్కువ అయ్యింది.
#3 పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర చేసిన నాలుగో సినిమా ఇది. అంతకుముందు కొమరం పులి, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించారు పవన్ కళ్యాణ్. కానీ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన పాత్ర మాత్రం ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా నిలిచింది. ఆ పాత్రకి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర అనగానే ఆసక్తి పెరిగింది.
#4 వకీల్ సాబ్ కి మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఈ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్ ని అందించారు. ఇది కూడా విశేషంగా మారనుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా క్రేజ్ కి మరొక ప్లస్ పాయింట్ అయ్యింది. ఇటీవల విడుదలయ్యి సూపర్ హిట్ అయిన అఖండ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక హైలైట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకి భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా భీమ్లా నాయక్ ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది.
#5 సాగర్ కే చంద్ర 2012లో అయ్యారే సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 2016లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మెప్పించాడు. ఇది అతని మూడో సినిమా. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో డైరెక్ట్ చేసే అవకాశం అతనికి వచ్చింది. అలాంటి కొత్త దర్శకుడితో ఇంత పెద్ద మల్టీ స్టారర్ సినిమా అంటే ఎలా ఉండబోతోందో అని జనాలు ఎదురు చూశారు.
#6 పవన్ కళ్యాణ్ పక్కన నిత్యా మీనన్ నటించారు. ఈమెది ఒక పవర్ ఫుల్ రోల్. అలానే రానా పక్కన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈమె మొదటి సినిమా ఇది. ఇది కూడా విశేషమే. నిత్యా మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇలాంటి పెద్ద సినిమాలో నిత్యా మీనన్ నటిస్తూ ఉండడంతో, అది కూడా పవర్ స్టార్ పక్కన అవ్వడంతో, కాంబినేషన్ కొత్తగా ఉండటంతో ఇంకా కొంచెం ఆసక్తి పెరిగింది.
అంతే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు కూడా వర్కవుట్ అయ్యాయి. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన ఆ మార్పులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఒరిజినల్ సినిమా కంటే తెలుగు సినిమా దాదాపు 30 నిమిషాల నిడివి తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల సినిమా క్రేజ్ ఇంకా పెరగడంతో ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. మళ్లీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతో అంత పెద్ద హిట్ పడింది అని అంటున్నారు.
End of Article