Ads
రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులందరూ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా ఈ ఆసక్తి పెరగడానికి ఇంకా కారణం అయ్యాయి. సినిమాలో సెట్టింగ్స్ చాలా బాగున్నాయి.
Video Advertisement
అప్పటి సమయంలో ఇటలీ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ప్రభాస్, పూజా హెగ్డే వేర్వేరుగా చాలా బాగా నటించారు అనిపిస్తుంది. ప్రభాస్, పూజా హెగ్డే కాస్ట్యూమ్స్, గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి వల్లే సినిమా టాక్ కొంచెం నెగిటివ్ గా వస్తోంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అంత వర్కవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. వారిద్దరినీ చూస్తున్నంత సేపు ఒక లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన అంత కెమిస్ట్రీ లేదేమో అనిపిస్తుంది.
#2 అలాగే తెలుగు ఓవర్సీస్ వెర్షన్‌లో సత్యరాజ్ పాత్ర కనిపిస్తారు. కానీ తెలుగులో అదే ప్లేస్‌లో కృష్ణంరాజు గారు కనిపిస్తారు. “ఇదేంటి తెలుగు సినిమాలో కూడా ఇలాంటి మార్పులు చేయడం ఏంటి?” అని కామెంట్స్ వస్తున్నాయి.
#3 ఇది ఒక లవ్ స్టోరీ. సాధారణ లవ్ స్టోరీ అంటే సినిమా చాలా స్లోగా నడుస్తుంది. కానీ కొన్ని సినిమాలు అలా ఉన్నా కూడా బాగుంటాయి. ప్రేక్షకులకి ఆసక్తి కలిగిస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఫైట్స్ కూడా లేకపోవడంతో అక్కడక్కడా ప్రేక్షకులకి బోర్ కొడుతుంది.
#4 గ్రాఫిక్స్ అంతా బాగున్నా కూడా కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్ అయ్యింది. ఇది కేవలం తెలుగులో విడుదల అయితే వేరేగా ఉండేది. కానీ తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా విడుదల అయ్యింది. అలాంటప్పుడు “ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అసలు అంత బడ్జెట్ పెట్టినప్పుడు కొంచెం కథపై కూడా దృష్టి పెడితే బాగుండేది” అని అంటున్నారు.
#5 అలాగే ప్రభాస్ హిందీలో చెప్పిన డబ్బింగ్ కూడా చాలా డల్ గా అనిపించింది అని అన్నారు. ఆ విషయంపై కూడా దృష్టి పెట్టాల్సింది అని కామెంట్స్ వచ్చాయి.
ఏది ఏమైనా సరే రాధే శ్యామ్ సినిమాకి మాత్రం చాలా చోట్ల హిట్ టాక్ వస్తోంది.
End of Article