Ads
వెంకటేష్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కామెడీ టైమింగ్. గత కొద్ది సంవత్సరాల నుండి వెంకటేష్ ఎన్నో రకాల సినిమాలని చేస్తున్నారు. కానీ వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సినిమా మాత్రం ఎఫ్ 2. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని ప్రకటించిన తర్వాత చాలామంది అది ఎలా ఉండబోతోంది అని ఎదురు చూశారు. ఎఫ్ 2 సీక్వెల్ అయిన ఎఫ్ 3 కూడా విడుదల అయ్యింది. ఇది మొదటి భాగానికి కొనసాగింపు కాదు. వేరే స్టోరీతో సినిమా నడుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకీ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. అందులోనూ ఈ సినిమాలో ఉన్న కామెడీ గురించి చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఇంత నెగటివ్ కామెంట్స్ మధ్యలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అంత నెగటివ్ గా ట్రోల్ అయినా కూడా సినిమా హిట్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 ప్రమోషన్స్
సినిమా హిట్ అవడంలో ప్రమోషన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటివల్ల సినిమా జనాల్లోకి చేరుతుంది. ఈ సినిమా టీం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. దాంతో సినిమాకి పబ్లిసిటీ ఇంకా బాగా వచ్చింది. అలాగే సినిమా ఎలా ఉండబోతోంది అని ముందే ప్రేక్షకులకి తెలిసింది.
#2 నటీనటులు
సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ మనం ఎఫ్ 2 లో చూసిన వారు. ఆ సినిమాలో వాళ్ళ పాత్రలకి కానీ, ఆ పాత్రలు చెప్పిన డైలాగ్స్ కి కానీ చాలా క్రేజ్ వచ్చింది. దాంతో ఇప్పుడు వారు కూడా ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది.
#3 ఫ్యామిలీ ఆడియన్స్
ఏదైనా సినిమా హిట్ అవ్వాలి అంటే అది కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమా అయ్యి ఉండాలి. కొన్ని సినిమాలు కాకుండా దాదాపు చాలా వరకు సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలాగా ఉంటేనే హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే అంశాలు చాలానే ఉన్నాయి. దాంతో సినిమా చూడడానికి ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించారు. అందుకే ముందు నుంచి కూడా సినిమా బృందం ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అని చెప్పారు.
#4 రిలీజ్ అయిన టైం
ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు వస్తే ప్రేక్షకులకు అది ఒక పండుగలాగా అయిపోయింది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమా విడుదల అయిన టైమింగ్ కూడా ఈ సినిమాకు హిట్ టాక్ రావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అది కూడా ఒక కామెడీ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. దాంతో ఈ సినిమాకి ఇలాంటి టాక్ రావడానికి ఇది కూడా ఒక కారణం అయ్యింది అని చెప్పొచ్చు.
ఇవి మాత్రమే కాకుండా, పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ తో సినిమా మీద ఉన్న క్రేజ్ ఇంకా పెరిగింది. ఇలాంటి కారణాల వల్ల ఎఫ్ 3 సినిమాకి హిట్ టాక్ వస్తోంది.
End of Article