Ads
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో యావత్ సినీ పరిశ్రమ షాక్‌లో ఉంది.అతను వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ నుండి కృష్ణంరాజు ప్రభాస్‌పై చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
Video Advertisement
ఇటు ప్రభాస్ కూడా పెదనాన్న కృష్ణంరాజు అంటే ఎంతో భయం , గౌరవం ఉండేవి. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పలు సందర్భాల లో ప్రభాస్ ప్రస్తావించారు. ప్రభాస్ అంచలంచలుగా ఎదిగిన తీరని చూసి కృష్ణంరాజు ఎంతో గర్వించారు. ప్రభాస్ మంచి హీరో అవుతాడు అని ఆశించాను కానీ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదుగుతాడని ఊహించలేదని, అది తనకు ఎంతో గర్వంగా ఉందని ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
ప్రభాస్‌కి కూడా తన పెదనాన్న కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం.ప్రభాస్ కృష్ణంరాజుతో రెబల్, బిల్లా మూవీస్ లో నటించారు. ఇటీవలే వీళ్ళిద్దరూ గురు శిష్యులుగా నటించిన మూవీ రాధే శ్యామ్ . ప్రొడ్యూసర్,యాక్టర్ మరియు పొలిటీషియన్ గా సంపూర్ణ జీవితాన్ని గడిపిన కృష్ణంరాజుకు ప్రభాస్ కి సంబంధించిన విషయంలో ఒక్క కోరిక మాత్రం నెరవేరలేదని చెప్పుకోవచ్చు.
ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన ఎన్నోసార్లు మీడియా ముందు ప్రస్తావించారు. ప్రభాస్ కు తగిన జోడి కోసం అన్వేషిస్తున్నామని, పెళ్లి కుదిరిన వెంటనే ఆ శుభవార్త అందరితో పంచుకుంటానని అంటుండే వారు. ప్రస్తుతం ఆయనకు ప్రభాస్ పెళ్లి కంటే ఆనందాన్ని కలిగించే విషయం వేరొకటి లేదని ఆయన అభిప్రాయపడేవారు. అంతేకాదు వీలైతే ప్రభాస్ పిల్లలతో కూడా నటించాలని ఉందని ఆయన ఎన్నో సందర్భాలలో తన కోరికను అందరితో పంచుకున్నారు.
కానీ ఆఖరికి తన కోరిక నెరవేర్చుకోకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున తన తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో రెబల్ స్టార్ కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు కూడ శోకసంద్రంలో మునిగిపోయారు.మేటి నటనతో ఆ తరాన్ని ఈ తరాన్ని మెప్పించిన నటుడు కృష్ణమరాజుకు అందరూ కన్నీటి వీడ్కోలు చెప్పారు.
End of Article