ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయ్యి మన రింగ్ టోన్స్ గా మారిపోయిన 13 BGM లు.!

ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయ్యి మన రింగ్ టోన్స్ గా మారిపోయిన 13 BGM లు.!

by Mohana Priya

Ads

సాధారణంగా ఒక సినిమా రిలీజ్ కంటే ముందే రిలీజ్ అయ్యేవి ఆ సినిమా యొక్క పాటలు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి హైప్ క్రియేట్ అవ్వడానికి మ్యూజిక్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఒక సినిమా మ్యూజిక్ హిట్ అయితే ఆ పాటలను మళ్లీ మళ్లీ వింటాం.

Video Advertisement

recent songs which became ringtones

ఇంకా విపరీతంగా హిట్టయితే, ఆ హిట్ అయిన పాటని రింగ్ టోన్ లాగానో లేదా కాలర్ ట్యూన్ లాగానో పెట్టుకుంటాం. అలా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదా పాట మనం ఎక్కడో ఒక చోట కాలర్ ట్యూన్ గా లేదా రింగ్ టోన్ గా వినే ఉంటాం. ఆ పాటల్లో కొన్ని పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 మాస్టర్ – మాస్టర్ ద బ్లాస్టర్

అసలు ఈ టైటిల్ చూడంగానే మీలో చాలా మందికి ఇది గుర్తొచ్చి ఉంటుంది. ప్రస్తుతం ట్రెండింగ్ రింగ్ టోన్ ఇదే.

#2 ఉప్పెన – జల జల జల పాతం

ఈ పాట మాత్రమే కాకుండా పాటకి మధ్యలో వచ్చే మ్యూజిక్ కూడా చాలా హిట్ అయ్యింది.

#3 కలర్ ఫోటో – తరగతి గదిలో

ఈ పాటను కూడా మనం చాలా ఫోన్ లకి రింగ్ టోన్ గా వినే ఉంటాం.

#4 మాస్టర్ – వాతి కమింగ్

ఒకసారి మనం కరెక్ట్ గా చూస్తే ఈ లిస్ట్ లో మాస్టర్ సినిమాలోని పాటలు అన్నీ ఉంటాయేమో. ఒకటి కాదు, రెండు కాదు, అసలు ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ అయ్యింది.

#5 జాను – ఊహలే ఫ్లూట్ మ్యూజిక్

ఇది తమిళంలో 96 లో విన్న తర్వాత చాలా మందికి రింగ్ టోన్ అయ్యింది. ఇంక తెలుగులో కూడా రీమేక్ అయిన తర్వాత చాలా చోట్ల ఈ రింగ్ టోన్ వినే ఉంటారు.

#6 జాతి రత్నాలు – చిట్టి

రథన్ సంగీత దర్శకత్వంలో, రామ్ మిరియాల పాడిన ఈ పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

#7 ఉప్పెన – నీ కన్ను నీలి సముద్రం

ఇందాక పైన మాస్టర్ కి చెప్పినట్టుగానే ఉప్పెన ఆల్బమ్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

#8 సోలో బ్రతుకే సో బెటర్ – హే ఇది నేనేనా

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట కూడా చాలా హిట్ అయ్యింది. ఈ పాటని ఎక్కడో ఒక చోట కాలర్ ట్యూన్ లేదా రింగ్ టోన్ గా వినే ఉంటారు.

#9 30 రోజుల్లో ప్రేమించడం ఎలా – నీలి నీలి ఆకాశం

యూట్యూబ్ లో 200 మిలియన్ల దాకా వ్యూస్ ఉన్నాయి అంటే ఈ పాటకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

#10 మనీ హెయిస్ట్ – బెల్లా చావ్ 

ఇది ఒరిజినల్ గా స్పానిష్ సిరీస్ అయినా కూడా ప్రపంచం మొత్తం చాలా పాపులారిటీ సంపాదించింది.

#11 స్కామ్ 1992 – థీమ్ సాంగ్

ఈ హిందీ సిరీస్ కూడా ఈ మధ్య చాలా పాపులర్ అయ్యింది. ఈ మ్యూజిక్ అయితే ఇంకా పాపులర్ అయ్యింది.

#12 మాస్టర్ – జెడి ఇంట్రో థీమ్

మాస్టర్ ఎవరు…..

#13 జాను – లైఫ్ ఆఫ్ రామ్

విడుదలైన కొన్ని నెలల తర్వాత ఈ పాట చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాటలో వచ్చే వయోలిన్ మ్యూజిక్ ని కొంతమంది అయినా రింగ్ టోన్ గా పెట్టుకునే ఉంటారు.


End of Article

You may also like