Ads
ఆడవాళ్ళకి వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం మనం నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో చూస్తూనే ఉంటాము…అది ఎలా పెరిగిపోయిందంటే..గతంలో ఎక్కడో ఒక చోట…కొన్ని సార్లు మాత్రం జరిగే..ఇలాంటి ఘటనలు..ఇప్పుడు ప్రతి రోజు మనకు తారస పడుతూనే ఉన్నాయి..నిజానికి చట్టాల్లో ఎన్ని మార్పులు తెచ్చిన కూడా ఆకతాయిలు తమ పనులు మానుకోవాటంలేదు…నిజానికి మార్పులు చట్టాల్లో కాదు..మనుషుల్లో రావాలి.! చరవాణీలు,అంతర్జాలాలు పెరిగిపోయిన తరువాత మరింత శృతి మించి పోతున్నారని చెప్పాలి..
Video Advertisement
అమ్మాయిల మీద వేధింపులు సామాన్యులకే కాదు..సెలెబ్రెటీలు కూడా బాధితులే..! వారు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలలో వారి లైఫ్ కి సంబంధించి చీకటి ఘటనలు మీడియా తో… చెబుతూ ఉంటారు..ఇలాంటి ఒక చెడు ఘటనే స్టార్ హీరోయిన్ రేజీనాకి ఎదురైన సందర్భాలు ఉన్నాయని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.తన కాలేజీ,స్కూల్ సమయాల్లో ఎదురైన సంఘటనల గురించి తెలుపుతూ.
‘నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చెన్నైలోని ఈగ థియేటర్ బ్రిడ్జి వద్ద కొందరు యువకులు దుర్భాషలాడారు ఒక యువకుడు తన శరీరం పై చెప్పుకోలేని చోట చెయ్యి తో తాకే ప్రయత్నం కూడా చేసాడు..నా పెదవులపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు..తనకు జరగరాని ఘటన ఏదో జరుగబోతుందని ముందే గమనించి ..ఎదురించే ప్రయత్నం చేశాను..!
స్కూల్ లో కూడా ఇలాంటి కొన్ని ఘటనలే ఎదురయ్యాయి..! అవతల వారిని ఎదురించే అంత బలం నాలో ఉండేది కాదు..ఇలాంటి ఘటనలు కొన్ని ఎదురయ్యాక ఇక ఒక నిర్ణయానికి వచ్చేసా శారేరకంగానే కాదు మానసికంగా కూడా దృడంగా మారాలి అని.దీనితో కసరత్తులు మొదలు పెట్టాను.శరీరంకంగా దృడంగా మారాను.! .అప్పటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ ఒంటరిగా కాకుండా స్నేహితులతో వెళ్లే దాన్ని..మునుపటి తో పోలిస్తే నేటి కాలం యువతులకు మరిన్ని సమస్యలు ఎక్కువయాయ్యి.అనే చెప్పాలి.రోజుకో కొత్త టెక్నాలజీలు పుట్టుకు రావడంతో కొత్త రూపం లో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.
End of Article