ఈ ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మహేశ్వరికి అతిలోక సుందరి శ్రీదేవికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

ఈ ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మహేశ్వరికి అతిలోక సుందరి శ్రీదేవికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అంటే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. అంతగా ఆమె అందం, అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న వయసులోనే బాలనటి గా తెరంగ్రేటం చేసిన ఆమె.. అతి తక్కువ వయసులోనే స్టార్ హీరో గా ఎదిగారు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు.

Video Advertisement

బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ తో తన జీవితాన్ని పంచుకున్నారు. కానీ.. చిన్న వయసులోనే అన్నిటిని వదిలి వెళ్లిపోయారు. శ్రీదేవి గురించి తెలియనివారెవరు ఉండరు.

sridevi 1

కానీ శ్రీదేవికి.. అలనాటి హీరోయిన్ మహేశ్వరికి ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. మహేశ్వరీ తెలుగునాట చాలా సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. “గులాబీ” సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. రవితేజ తో కలిసి నటించిన నీకోసం సినిమా కూడా మంచి పేరు సంపాదించిపెట్టింది. ఒకప్పుడు ఆమె దాదాపు అందరు టాప్ హీరోలతోనూ నటించారు. సినిమాల్లోనే కాదు.. ఆమె పలు టివి షోలలో కూడా చేసారు.

sridevi 2

అయితే మహేశ్వరి ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయితే.. శ్రీదేవితో ఆమెకు బంధుత్వం ఎలా ఏర్పడిందో చూద్దాం. మహేశ్వరి శ్రీదేవికి స్వయానా అక్క కూతురు అవుతుంది. అంటే మహేశ్వరి శ్రీదేవికి పిన్ని వరుస అవుతుందన్నమాట. అలా వీరిద్దరి మధ్య పిన్ని కూతుర్ల సంబంధం ఏర్పడింది. కానీ.. వీరి బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు.


End of Article

You may also like