జియోలో షేర్లును కొన్న ఫేస్బుక్.. అసలు కారణం ఏంటో తెలుసా ?

జియోలో షేర్లును కొన్న ఫేస్బుక్.. అసలు కారణం ఏంటో తెలుసా ?

by Anudeep

“ఇంటర్నెట్ ఫ్రీ బేసిక్స్” అని ఆ మధ్య వస్తే యావత్ దేశం అంతా వ్యతిరేకించింది .. దాని ద్వారా మన డేటా అంతా పరాయివాడిచేతుల్లోకి వెళ్లిపోతుంది.. ఎట్టిపరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదని.. కానీ  ఇప్పుడు మరో దారిలో వచ్చి అదే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది జియోలో శేర్లను ఫేస్ బుక్ వాడు కొనడం చూస్తుంటే..

Video Advertisement

ప్రస్తుతం మన దేశ జనాభా సుమారు 1.38 బిలియన్లు. అందులో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 460-470 మిలియన్లు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇది 700 మిలియన్ల వరకు చేరుకుంటుంది అని అంచనా..ఇప్పటికే ఇంతమంది వాడుతున్నా కూడా పూర్తిగా ఇంటర్నెట్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఎక్కువమంది బేసిక్స్ ని మాత్రమే ఉపయోగిస్తారు..ఎలాగూ ఫ్రీనే కదా.. మన దగ్గర ఇంటర్నెట్ దొరికినంత ఫ్రీగా ఒక కుటుంబానికి భోజనం దొరకదు అది కరోనా కాలంలో బాగా అర్దం అవుతోంది.

మొబైల్ రంగంలో వచ్చిన అతిపెద్ద విప్లవం “జియో”. సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇండియాదే.. ప్రస్తుతం జియో కి, ఎఫ్బీ కి లింక్ అయి ఉన్న అకౌంట్ల సంఖ్య 388 మిలియన్లు.. అసలు జియో శేర్లు ఎఫ్బీ కొనడం కాదు.. వాట్సప్ , ఇన్స్టా ఇవన్ని కూడా ఎఫ్బీ వే.. ఇప్పుడు కూడా వాట్సప్ ని వియ్ ఛాట్ కి ధీటుగా మెరుగుపర్చాలనే దాంట్లో భాగంగానే ఈ శేర్ల కొనుగోలు జరిగిందనేది సమాచారం.

చైనావారకే ప్రత్యేకమైన వియ్ ఛాట్ మొదట్లో కేవలం ఛాటింగ్ కి మాత్రమే ఉపయోగపడేది, కాని తర్వాత అందులో గేమ్స్ , మనీ ట్రాన్స్ఫర్ ,షాపింగ్, టాక్సీలను బుక్ చేయడం ఇలా అనేక రకాలుగా వియ్ ఛాట్ ఉపయోగపడింది. వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఇదే చేయాలనుకుంటుంది . రిటైల్ విభాగంలోకి ప్రవేశించాలనుకునే JIo తో భాగస్వామి కావడం దీనికి కలిసొచ్చిన అంశం. ఇందులో భాగంగా జియో సాయంతో వాట్సప్ మరియు రిలయన్స్ రిటైల్ ముందుకు వెళితే మరింత లాభపడొచ్చనేది కాన్సెప్ట్..

కార్లు అమ్ముకునే కంపెనీవాడు హైవేస్ నిర్మించే కంపెనీలు శేర్లు కొన్నట్టే..ఇది కూడానే.. జియో రోడ్ వేసుకుంటూ వెళ్తుంటే ఆ రోడ్లపై తిరిగే కార్లను ప్రొడ్యూస్ చేసే కంపెనీలుగా వాట్సప్, ఫేస్బుక్ అవతరించి  వారి వారి బిజినెస్లను నడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాయనేది అర్దమవుతోంది.


You may also like

Leave a Comment