Ads
చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా గత సంవత్సరం విడుదల అయ్యింది. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా నటించారు.
Video Advertisement
ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా ఆ అంచనాలని అందుకోలేకపోయింది. పాత స్టోరీ అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. రొటీన్ కమర్షియల్ సినిమా టెంప్లేట్ లోనే ఈ సినిమా కూడా సాగింది అని అన్నారు.
వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. చిరంజీవి ఈ సినిమాలో చాలా కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. టీజర్ చూస్తే ఇది ఒక కమర్షియల్ సినిమా అని అర్థం అవుతోంది. చిరంజీవి అంతకుముందు చాలా సినిమాలు రీమేక్ చేశారు. అందులో కొన్ని హిట్ అయ్యాయి. అలా చిరంజీవి రీమేక్ చేసి హిట్ అయిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 ఖైదీ నెంబర్ 150
చిరంజీవి, కాజల్ అగర్వాల్ నటించిన ఖైదీ నెంబర్ 150 తమిళ్ స్టార్ విజయ్ నటించిన కత్తి సినిమా రీమేక్. ఇది తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో కూడా హిట్ అయ్యింది.
#2 గాడ్ ఫాదర్
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.
#3 స్నేహం కోసం
ఈ సినిమా తమిళ్ సినిమా నాట్పుక్కాగ రీమేక్. తెలుగులో ఈ సినిమాకి ఆశించిన ఫలితం రాలేదు.
#4 విజేత
ఈ సినిమా బెంగాలీ సినిమా సాహెబ్ కి రీమేక్.
#5 శంకర్ దాదా ఎంబిబిఎస్
హిందీలో చాలా పెద్ద హిట్ అయిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకి ఈ సినిమా రీమేక్.
#6 చట్టానికి కళ్ళు లేవు
చిరంజీవి హీరోగా నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా సట్టం ఒరు ఇరుత్తరై అనే సినిమా రీమేక్.
#7 పసివాడి ప్రాణం
పసివాడి ప్రాణం కూడా పూవిను పుతియా పూంతెన్నల్ అనే ఒక మలయాళం సినిమాకి రీమేక్.
#8 ఘరానా మొగుడు
చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి అయిన ఘరానా మొగుడు కూడా అనురాగ అరళితు అనే ఒక కన్నడ సినిమా రీమేక్.
#9 పట్నం వచ్చిన పతివ్రతలు
చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా పట్టణక్కె బంద పత్నియరు అనే ఒక కన్నడ సినిమా రీమేక్.
#10 హిట్లర్
మలయాళం సినిమా హిట్లర్ ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.
#11 ప్రతిబంద్
చిరంజీవి హీరోగా నటించిన హిందీ సినిమా ప్రతిబంద్ కూడా అంకుశం సినిమా రీమేక్.
#12 ఠాగూర్
చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమా కూడా రమణ అనే ఒక తమిళ్ సినిమా రీమేక్.
#13 రాజా విక్రమార్క
చిరంజీవి, అమల అక్కినేని, రాధిక నటించిన రాజా విక్రమార్క సినిమా కూడా కమింగ్ టు అమెరికా అనే ఒక అమెరికన్ మూవీ ఆధారంగా తీశారు.
#14 ఎస్పీ పరశురామ్
చిరంజీవి హీరోగా నటించిన ఎస్పీ పరశురామ్ సినిమా కూడా వాల్తేర్ వెట్రివల్ సినిమాకి రీమేక్.
#15 ఆరాధన
చిరంజీవి కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు. అందులో ఆరాధన సినిమా ఒకటి. ఈ సినిమాని కడలోర్ కవిదైగళ్ అనే ఒక తమిళ సినిమాకి రీమేక్‌గా రూపొందించారు.
ఇవి మాత్రమే కాకుండా చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్.
End of Article