Ads
1990 నాటి కాలంలో తెలుగు, తమిళ, మలయాళ చిత్రంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరిని ఆకర్షించింది. తన నటనతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ పాప బేబీ షామిలి.
Video Advertisement
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా ఎన్నో భాషలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది బేబీ షామిలి. తమిళ్ లో నటించిన అంజలి మన తెలుగులో కూడా వచ్చింది. ఈ చిత్రానికిగాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్ ను దక్కించుకుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ చిత్రంలో బుజ్జి గా, నాగార్జున సరసన కిల్లర్ చిత్రంలో స్నేహ గాను, జోకర్ చిత్రంలో ఆపిల్ గాను, ఇలా అనేక చిత్రాలలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 2009వ సంవత్సరంలో ఓయ్ చిత్రంలో సిద్ధార్థ పక్కన సంధ్య క్యారెక్టర్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షామిలి. ఈ చిత్రం షామిలికి అంత మంచి గుర్తింపును సంపాదించలేదు.
మరలా తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తో 2018 తెలుగు లో అమ్మమ్మగారిల్లు చిత్రంలో హీరో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా సీత క్యారెక్టర్ చేసింది. ఈ చిత్రం కూడా షామిలికి విజయాన్ని సంపాదించలేకపోయింది.
తెలుగుతో పాటు తమిళ్ మరియు మలయాళం లో కూడా నటించిన చిత్రాలలో సక్సెస్ సాధించలేకపోయింది. తాను హీరోయిన్ గా నటించిన చిత్రాలన్నీ సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
చిన్న వయసులోనే అంత అందంగా ఉన్న షామిలి ఇప్పుడు కూడా అదే అందంతో అందరిని తనవైపు ఆకర్షిస్తుంది. లేటెస్ట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
https://www.instagram.com/p/CelP-9UvDtF/?utm_source=ig_web_copy_link
End of Article