జబర్దస్త్ లో ఈ జడ్జెస్, యాంకర్స్, టీం లీడర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?

జబర్దస్త్ లో ఈ జడ్జెస్, యాంకర్స్, టీం లీడర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?

by Mohana Priya

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Video Advertisement

ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. జడ్జెస్ గా రోజా ఇంకా మనో ఉంటారు. అంతకు ముందు నాగబాబు జడ్జ్ గా ఉండేవారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షోస్ నుండి నిష్క్రమించారు.

ఇప్పుడు మల్లెమాల ప్రొడక్షన్స్ యాజమాన్యం,  షో రెమ్యూనరేషన్ విషయంలో భారీగా మార్పులు చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్స్ విషయంలో మాత్రమే కాకుండా షో లో కూడా మార్పులు జరిపారు. జడ్జ్ స్థానంలో ఉన్న రోజా లాక్ డౌన్ ప్రకటించక ముందు 3 లక్షల నుంచి 4 లక్షల పారితోషకం తీసుకునేవారు.

ఇప్పుడు రోజా రెమ్యూనరేషన్ దాదాపు డబల్ అయింది. అంటే నెలకి 8 ఎపిసోడ్ లకు 30 లక్షల పారితోషకం తీసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ, రష్మీ లాక్ డౌన్ కి ముందు 50 నుండి 80 వేలు తీసుకొనేవారు. ప్రస్తుతం నెలకు 4 లక్షల నుండి 5 లక్షల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్నారు.

టీం లీడర్ల విషయానికొస్తే చమ్మక్ చంద్ర నెలకు 4 లక్షల రూపాయలను తీసుకుంటారు. చమ్మక్ చంద్ర జీ తెలుగు నుండి వచ్చిన తర్వాత కూడా షో కి మంచి హైప్ ఉంది అని అంటున్నారు. అంతకు ముందు ఒక్క ఎపిసోడ్ కి 3 నుంచి 3.5 లక్షల పారితోషికం తీసుకున్న సుడిగాలి సుధీర్, ప్రస్తుతం 5 లక్షల వరకు అందుకుంటున్నారు.

అలాగే అంతకు ముందు 3 లక్షల పారితోషికం తీసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం 4.5 లక్షల పారితోషకం తీసుకుంటున్నారు. అలాగే రాకెట్ రాఘవ 3.5 లక్షలు, చలాకీ చంటి 2 లక్షలు, కిరాక్ ఆర్పీ 2.8 ల‌క్ష‌లు, అదిరే అభి 3 ల‌క్ష‌లు, ఆటో రాంప్రసాద్ 3 లక్షలు, బుల్లెట్ భాస్కర్ టీం 2 ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటున్నారు. మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్, సునామి సుధాకర్ కూడా పారితోషికం లక్షల్లోనే అందుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


End of Article

You may also like