Ads
సాధారణంగా క్రికెటర్ల సంపాదన భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఇండియన్ క్రికెటర్లకు సంపాదన ఎక్కువగానే ఉంటుంది. బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) క్రికెటర్లకు మ్యాచ్ లో వారి ప్రదర్శన ఆధారంగా కాంట్రాక్ట్స్ ఇస్తుంది. మేజర్ టోర్నీల్లో ఆటగాళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ మళ్ళీ వేరుగా ఉంటుంది.
Video Advertisement
ప్రస్తుతం భారత జట్టు ఆసియా కప్ 2023 లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీంఇండియా ఫైనల్ కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్ లో సెప్టెంబర్ 17న శ్రీలంకతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడుతున్న భారత క్రికెటర్లకు ఎంత పారితోషికం ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
ఆసియా కప్ లో ఆడుతున్న క్రికెటర్ల రెమ్యునరేషన్ వారి వారి జట్ల మ్యాచ్‌లలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక జట్టు ఎన్ని మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒక క్రికెటర్ ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ రెండింటి మీద మ్యాచ్ ఫీజు అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ప్లేయర్ మ్యాచ్‌లో ఆడనట్లయితే ఆ ప్లేయర్ ఆ మ్యాచ్ కు పారితోషికం అందుకోలేరు.
ఆసియా కప్‌లో ఇండియా కనీసం 5 మ్యాచ్‌లు ఆడుతుందని అంచనా. దాన్ని బట్టి అన్ని మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు కనీసం 30 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్ల సంపాదన మరింతగా పెరుగుతుంది. బోర్డ్ కాంట్రాక్ట్ ప్రకారం ఆసియా కప్ టోర్నీ ఆధారిత ఫీజు కాకుండా, కాంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ క్రికెటర్లు శాలరీ పొందుతారు.
సాధారణంగా బీసీసీఐ క్రికెటర్లను A+, A, B, C గ్రేడ్‌లుగా విభజిస్తుంది. A+ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. వారి ఏడాది శాలరీ రూ. 7 కోట్లు. ఆర్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్ లాంటి గ్రేడ్ ఏ ప్లేయర్స్ ఏడాది శాలరీ రూ.5 కోట్లు ఉంటుంది.
End of Article