“వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి” పెళ్ళికి “రేణు దేశాయ్” ఇందుకే వెళ్లలేదా..? అసలు కారణం ఏంటంటే..?

“వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి” పెళ్ళికి “రేణు దేశాయ్” ఇందుకే వెళ్లలేదా..? అసలు కారణం ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

మెగా ఇంట మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నవంబరు 1వ తారీఖున ఇటలీలో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ పయనమై వెళ్ళిపోయారు. ఇప్పటికే అక్కడ హల్దీ ఫంక్షన్, కాక్ టైల్ పార్టీ కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు రామ్ చరణ్ -ఉపాసన దంపతులు అల్లు అర్జున్-స్నేహ దంపతులు ఇప్పటికే ఇటలీలో సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నా తో కలిసి ఇటలీ వెళ్లారు. మెగా హీరోలు అంతా తమ షూటింగ్ లు పక్కనపెట్టి వరుణ్ తేజ్ పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరగనుంది.

lavanya-tripathi

హైదరాబాద్ తిరిగి వచ్చాక భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.ఇప్పుడు ఈ పెళ్లిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. వరుణ్ తేజ్ పెళ్లికి తాను వెళ్లట్లేదు అని చెబుతూనే దాని వెనకాల కారణం కూడా చెప్పారు. సాక్షి టీవీ కథనం ప్రకారం…

నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని పంపించాను. వరుణ్ తేజ్ నా కళ్ళముందే పెరిగాడు. అతడికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అయితే వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అన్- కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అకిరా-ఆద్య కూడా వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లట్లేదు అని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు.

 

Also Read:గుర్తుపట్టలేంతగా మారిపోయిన భానుప్రియ..! ఇలా అయిపోయారేంటి..?


End of Article

You may also like