గుర్తుపట్టలేంతగా మారిపోయిన భానుప్రియ..! ఇలా అయిపోయారేంటి..?

గుర్తుపట్టలేంతగా మారిపోయిన భానుప్రియ..! ఇలా అయిపోయారేంటి..?

by kavitha

Ads

ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్లే ఉంటారు. చాలా మంది ఒక సినిమా చేసిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోతారు.

Video Advertisement

మరి కొంత మంది మరి కొన్ని సినిమాలు చేశాక దూరం అవుతారు. ఎన్నో సంవత్సరాల క్రితం కెరీర్ మొదలు పెట్టినా కూడా చాలా మంది వారి టాలెంట్ కారణంగా ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. వారిలో భానుప్రియ ఒకరు.

హీరోయిన్ గా నటించిన భానుప్రియ ఆ తర్వాత అక్కగా, ఆ తర్వాత తల్లిగా కూడా నటించారు. పాత్ర ఏదైనా కూడా తన వంతు న్యాయం చేస్తారు. అందుకే భానుప్రియ నటన ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులకు గుండెల్లో నిలిచిపోయింది. అయితే భానుప్రియ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1998 లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న భానుప్రియ 2005 లో విడిపోయారు. వీరిద్దరికి అభినయ అనే ఒక పాప కూడా ఉంది.

2018 లో ఆదర్శ్ కౌశల్ గుండె సమస్య కారణంగా చనిపోయారు. ప్రతి సంవత్సరం ఒకటి, రెండు సినిమాల్లో భానుప్రియ నటిస్తూనే ఉన్నారు. భానుప్రియ చివరిగా తెలుగులో నాట్యం సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించారు. ఈ సినిమా 2021 లో విడుదల అయ్యింది. మళ్లీ తర్వాత ఇప్పటి వరకు భానుప్రియ తెలుగులో నటించలేదు. అయితే ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న అయలాన్ సినిమాలో భానుప్రియ హీరో తల్లిగా నటించారు. కానీ ఈ సినిమా 2016 లోనే చిత్రీకరించారు. కొన్ని నెలల క్రితం భానుప్రియ ఒక ఈవెంట్ కి హాజరు అయ్యారు. ఆ వీడియో బయటకి వచ్చింది.

what happened to bhanupriya

అందులో భానుప్రియ నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారు. అంత చలాకీగా ఉండే భానుప్రియ ఇలా అయిపోయారు ఏంటి అని అందరూ అంటున్నారు. భానుప్రియకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని, అంతే కాకుండా కంటి చూపుకి సంబంధించిన ఇబ్బంది కూడా భానుప్రియకి ఉంది అనే వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ భానుప్రియ మళ్ళీ మరొక తెలుగు సినిమాలో నటిస్తే చూడాలి అని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

watch video :

ALSO READ : “మృణాల్ ఠాకూర్” వయసు ఇంతా..? చిన్న పిల్ల అనుకున్నాం కదా..?


End of Article

You may also like