పోలీసు సైరన్ పెట్టుకొని రోడ్డు మీద షికారు చేసాడు ,చివరికి ఇలా అడ్డంగా బుక్కైపోయాడు (వీడియో )

పోలీసు సైరన్ పెట్టుకొని రోడ్డు మీద షికారు చేసాడు ,చివరికి ఇలా అడ్డంగా బుక్కైపోయాడు (వీడియో )

by Anudeep

Ads

కరోనాని వ్యాప్తి చెందించకుండా ఉండేందుకు లాక్ డౌన్ ఒక్కటే సరైన పరిష్కారం అని ఇరవై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పట్లేదు. ఎదుటి వ్యక్తి స్థాయిని కూడా చూడకుండా పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. నిబంధనలను ఉల్లంగించినందుకు ప్రసిధ్ద కూలర్ రెస్టారెంట్ ఓనర్ అలీ కూలర్ ని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఇంతకీ మనోడు ఏం చేశాడో తెలుసా?

Video Advertisement

ముంబైలో ప్రసిద్ది చెందిన రెస్టారెంట్ కూలర్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ యజమాని అలీ కూలర్. అతగాడు ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ముంభైలోని ఖాలీ రోడ్లపై అలీ కూలర్ తన కారేసుకుని తిరుగుతన్న వీడియో అది. ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తన కారులో తను తిరిగితే తప్పేంటి అనుకుంటున్నారా?

లాక్ డౌన్ ప్రకటించాక రోడ్ల మీదకి రావొద్దని చెప్పిన తర్వాత తీసిన వీడియో ఇది. అంతే కాదు పోలీస్ సైరన్ ఉపయోగించి మరీ రోడ్లపై విహారం చేశాడు. లాక్ డౌన్ నిభంధనలు ఉల్లంగించిందే కాకుండా పోలీస్ సైరన్ ఉపయోగించడం, ఆ వీడియోలో సిల్లీగా కామెంట్ల్ చేయడం. సోషల్ మీడియాలో వైరలయిన వీడియో పోలీసుల వరక చేరింది. తర్వాత అలీకూలర్ ని పట్టుకున్నారు.

అలీ కూలర్ ని పట్టుకున్న పోలీసులు అతడిచేత క్షమాపణలు చెప్పించారు. అంతేకాదు లాక్ డౌన్లో ఉన్నప్పుడు ప్రజలు ఏ నిబంధనలు పాటించాలి, పోలీసులకి ఏ విధంగా మద్దతు తెలపాలి లాంటి వన్ని చెప్పించారు.ఇంతటితో కథ అయిపోలేదు. మనోడిపై కేసు కూడా ఫైల్ చేశారు.  పోలీసులని బకరా చేస్తున్నా అనుకున్నాడు.చివరకి తనే బకరా అయ్యాడు. కాబట్టి అడుగు బయట పెట్టేటప్పుడే ఆలోచించుకోండి . లాక్ అప్పో..లాక్ డౌనో నిర్ణయించుకుని బయటికి రండి.


End of Article

You may also like