సెలెబ్రిటీల విడాకులపై “ట్రెండ్ సెట్టర్స్” అంటూ ఆర్జీవీ కౌంటర్.. నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవుగా..!

సెలెబ్రిటీల విడాకులపై “ట్రెండ్ సెట్టర్స్” అంటూ ఆర్జీవీ కౌంటర్.. నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవుగా..!

by Anudeep

Ads

సమంత నాగ చైతన్యలు విడిపోవడం, దీప్తి సునయన షన్ను లు కూడా బ్రేక్ అప్ చెప్పుకోవడం గత కొన్ని రోజులుగా ఈ విడాకుల టాపిక్స్ గురించి సోషల్ మీడియాలో కధనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. మరో సెలెబ్రిటీ జంట విడిపోయారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం అని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Video Advertisement

తమిళ నటుడు ధనుష్ కు దక్షిణాదిన మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ కి అల్లుడు అయినా.. తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్.

dhanush

ఇటీవల తన భార్య ఐశ్వర్యంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వీరు ఇద్దరు తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా.. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. దీనితో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్నేళ్ల తరువాత వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు సైతం ఆశ్చర్య పోతున్నారు.

RGV

తాజాగా.. మరో సెలబ్రిటీ జంట విడిపోవడంతో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. “సెలెబ్రిటీల విడాకులు ట్రెండ్ సెట్టర్స్ లాంటివని.. పెళ్లి అనేది ఎంత ప్రమాదకరమో యువతకు తెలియచెబుతాయని” ఆయన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసారు.. ఆయన పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే వేదాంతం చెప్తారని ఒక నెటిజెన్ కామెంట్ చేయగా.. నిజమే చెప్పారు అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేసారు. ఏది ఏమైనా.. ఆర్జీవీ వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


End of Article

You may also like