RGV : తన ఫస్ట్ లవర్ ఫోటో ను షేర్ చేసిన ఆర్జీవీ..! ఎవరంటే?

RGV : తన ఫస్ట్ లవర్ ఫోటో ను షేర్ చేసిన ఆర్జీవీ..! ఎవరంటే?

by Anudeep

Ads

రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు ఆయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. ఈ మధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు, అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అది ఆయన ఫాలోయింగ్.

Video Advertisement

rgv

తాజాగా ఆయన మరో ఫోటో ను షేర్ చేసారు. ఓ అమ్మాయి ఫోటో ను షేర్ చేసి ఆమె తన ఫస్ట్ లవర్ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు శ్రీదేవి ని తప్ప ఆర్జీవీ ఎవరిని ప్రేమించలేదని అనుకున్న నెటిజన్లు ఆర్జీవీ తన ఫస్ట్ లవర్ ను పరిచయం చేయడం తో షాక్ అవుతున్నారు. కాలేజీ డేస్ లో ఆమెను తాను లవ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆమె పేరు పోలవరపు సత్య అని తెలిపారు. ఆ అమ్మాయి మెడిసిన్ చదివిందని పరిచయం చేసారు. ఆర్జీవీ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ లో బిటెక్ చదువుతున్నపుడు.. ఆ అమ్మాయి సిద్ధార్థ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చదివేది అని గుర్తు చేసుకున్నారు. ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉండిపోయేవాడినని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like