Ads
కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్ లో ఉధృతం గా ఉంది. అయితే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి కరోనా మహమ్మారి పై ట్వీట్ వేశారు. ప్రతి విషయాన్నీ వ్యంగం గా తీసుకుని మాట్లాడే ఆర్జీవీ ఈ సారి కూడా తన వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. కరోనా మహమ్మారి తో ప్రజలు అల్లాడుతూ.. కాపాడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ మహమ్మారి నుంచి దేవుడొక్కడే కాపాడగలడని భావిస్తున్నారు.
Video Advertisement
ఈ విషయమై ట్వీట్ చేసిన వర్మ ” ఈ లోకం లో ప్రతి సృష్టికి కారణం ఆ దేవుడే.. మరి అలాంటప్పుడు కరోనా ను సృష్టించింది కూడా ఆ భగవంతుడే. అలాంటి దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు..” అంటూ ట్వీట్ వేశారు. దీనిపై నెటిజన్లు కూడా ఘాటు గానే స్పందిస్తున్నారు. వర్మ తాను నాస్తికుడని.. ఏ విషయాలు పట్టించుకోడని మరో సారి రుజువైంది.
End of Article