Ads
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : వ్యూహం
- నటీనటులు : అజ్మల్ అమీర్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, మానస రాధాకృష్ణన్.
- నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
- దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
- సంగీతం : బాలాజీ
- విడుదల తేదీ : మార్చి 2, 2024
స్టోరీ :
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన సీన్ తో సినిమా మొదలవుతుంది. అయితే, సినిమాలో అందరి పేర్లు మార్చారు. వీర శేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని, మదన్ రెడ్డి, వైయస్ భారతి గారిని మాలతి, సోనియా గాంధీని మేడం, బాబు గారు, ముఖేష్, జనసేన పార్టీ పేరుని మనసేన, శ్రవణ్ కళ్యాణ్ పేర్లతో సినిమాలో పాత్రలని చూపించారు. తండ్రి చనిపోయాక మదన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఏం చేశారు? ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ సినిమాలో చూపించారు.
రివ్యూ :
వైయస్ఆర్ గారి మరణం తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ కూడా సినిమాలో చూపించారు. అయితే సినిమాలో పాత్రల పేర్లు మాత్రం మార్చి చూపించారు. అయినా కూడా వస్త్రధారణ, వేషధారణని బట్టి వాళ్ళు ఎవరు అనేది మనకి అర్థం అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. నిజ జీవితంలో ఉన్న వ్యక్తుల ఆధారంగా ఈ పాత్రలు రూపొందించారు కాబట్టి, వారి హావభావాలు, మాట్లాడే విధానం అవన్నీ కూడా నిజ జీవితంలో ఉండే వ్యక్తుల లాగానే ఉండేలాగా చూసుకున్నారు. చాలా వరకు అలాగే చేశారు కూడా.
కాబట్టి ఆ పాత్రల్లో ఆ నటీనటులు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. డైలాగ్ డెలివరీ, వాయిస్ మోడ్యులేషన్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు సినిమాలో ఆ పాత్రలు ఎవరు అనేది తెలియజేసేలాగా ఉన్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ చాలా బాగా నటించారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు. అవన్నీ తెరపై చాలా బాగా కనిపించాయి. నేపథ్య సంగీతం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కానీ సినిమా అంతటా కూడా కంటెంట్ పరంగా బలంగా ఉండేలాగా చూసుకున్నారు.
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
వైయస్సార్ గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సంఘటనలని ఈ సినిమాలో చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ముందడుగు వేశారు అనే విషయాలని కూడా ఇందులో చూపించారు. ఇది ఒక మంచి పొలిటికల్ డ్రామా.
watch trailer :
ALSO READ : ఇలా కుడా అవుట్ అవుతారా.? పాపం తమన్ అన్న..!
End of Article