ఇలా కుడా అవుట్ అవుతారా.? పాపం తమన్ అన్న..!

ఇలా కుడా అవుట్ అవుతారా.? పాపం తమన్ అన్న..!

by Mounika Singaluri

Ads

సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీస్ కి సినిమా మీద మాత్రమే కాకుండా, ఇంకా చాలా విషయాలు మీద కూడా అవగాహన ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న ఎంతో మంది, క్రీడారంగంలో కూడా రాణించిన వారు ఉన్నారు. క్రీడలలో శిక్షణ పొంది, తర్వాత సినిమాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

Video Advertisement

పరిచయం అవసరం లేని వ్యక్తి. గత కొద్ది సంవత్సరాల నుండి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తమన్ ఇస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ఇంకొక మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమన్ బాయ్స్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఇదే తమన్ మొదటి సినిమా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. తమన్ కి క్రికెట్ లో కూడా చాలా మంచి అవగాహన ఉంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అయిన ప్రతిసారి తమన్ ఇందులో పాల్గొంటున్నారు. చాలా సందర్భాల్లో తమన్ క్రికెట్ మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్ గురించి మాట్లాడారు. ఖాళీ సమయం దొరికితే ఇప్పటికి కూడా క్రికెట్ ఆడతాను అని చెప్తారు. అంతే కాకుండా ఎప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు కూడా క్రికెట్ ఆడతాను అని, అలా ఆడినప్పుడు ఒత్తిడి అంతా పోతుంది అని తమని చెప్పారు. అయితే ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో తమను కూడా ఆడుతున్నారు.

thaman innings at ccl 2024

నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తమన్ బ్యాట్ విరిగేలాగా బంతి కొట్టారు. అయితే ఇక్కడే మరొక సంఘటన కూడా జరిగింది. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో పరిగెడుతున్నప్పుడు తమన్ ఫీల్డర్ చెయ్యి పట్టుకున్నారు. క్రికెట్ రూల్స్ ప్రకారం అలా చేయడం నియమాలకు విరుద్ధం. దాంతో తమన్ అవుట్ అయ్యారు. దాంతో, “ఇలా కూడా అవుట్ అవుతారా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తమన్ నిన్న మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. బ్యాట్ విరిగిపోయే రేంజ్ లో తమన్ ఆడారు అంటే ఎంత బాగా ఆడారు అనేది మనమే అర్థం చేసుకోవాలి. తమన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు. మంచి క్రికెటర్ కూడా.

watch video : 

ALSO READ : చిన్మయి శ్రీపాద వాడిన ఆ పదం ఏంటి..? అసలు ఆమె మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు..?


End of Article

You may also like