రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ధనవంతురాలు ఎవరో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ధనవంతురాలు ఎవరో తెలుసా?

by Anudeep

Ads

తాజాగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 జాబితా విడుదల అయింది. ఇందుల శ్రీమంతుల జాబితాలో మహిళల పేర్లు కూడా ఉండడం విశేషం. ఈ జాబితా ప్రకారం బయోలాజికల్ ఈ. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాహిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ధనిక మహిళగా పదిహేనవ స్థానంలో నిలిచారు. ఆమె నికర సంపద విలువ 7700 ల కోట్లుగా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఆమె 231వ ర్యాంకులో ఉన్నారు.

Video Advertisement

richest women

ఆమె లండన్ లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మానేజ్మెంట్ లో డిగ్రీ పట్టా పొందారు. 2001 నుంచే ఆమె బయోలాజికల్ ఈ. లిమిటెడ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సంస్థ రక్తం గడ్డకుండా ఉండడం కోసం అవసరమయ్యే హెపారిన్ అనే పదార్ధాన్ని తయారు చేస్తుంది. మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు కూడా ఈ జాబితాలో నిలిచారు. ఈమె వేయి కోట్ల ఆస్తుల్ని కలిగి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఆమె 41 వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితా తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 69 మంది వ్యక్తులు ఉన్నారు. వీరి ఆస్తుల విలువ సుమారు రూ.3,79,200 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే, ఇది 54 శాతం పెరిగిందట.


End of Article

You may also like