ట్రోల్ చేసిన అతనితోనే ఫోటో…ఇది కదా మంచి నాయకుడి లక్షణం అంటే.! ఈ ఫోటో వెనక కథేంటంటే.?

ట్రోల్ చేసిన అతనితోనే ఫోటో…ఇది కదా మంచి నాయకుడి లక్షణం అంటే.! ఈ ఫోటో వెనక కథేంటంటే.?

by Harika

Ads

టీవీలో వచ్చే కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన కమెడియన్ రియాజ్. జబర్దస్త్ తో పాటు ఇంకా ఎన్నో కామెడీ షోస్ లో కనిపించారు. యూట్యూబ్ లో కూడా చాలా ఫేమస్. ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటికి కూడా ఎన్నో ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్ కామెడీతో అలరిస్తూ ఉంటారు. గతంలో రియాజ్ బొమ్మ అదిరింది అనే ఒక షో చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ స్కిట్ చేశారు. ఆ సమయంలో ఆ స్కిట్ ఎన్నో చర్చలకు దారి తీసింది. రియాజ్ మీద కామెంట్స్ వచ్చాయి. దాంతో రియాజ్ క్షమాపణలు చెప్పారు.

Video Advertisement

ring riyaz picture with ys jagan mohan reddy

తర్వాత రియాజ్ జనసేన పార్టీలో చేరి, నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా రియాజ్ పోటీ చేసినప్పుడు ఆయనకి 12 ఓట్లు వచ్చాయి. దాంతో జనసేన పార్టీ నుండి బయటికి వచ్చేసి వైసీపీ పార్టీలో చేరారు రియాజ్. అభివృద్ధి ఉన్నచోట రియాజ్ ఉంటాడు అంటూ ఈ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత నెల్లూరు నగర వైసిపి దివ్యాంగుల కమిటీ చైర్మన్ గా రియాజ్ ని నియమించారు. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.

ring riyaz picture with ys jagan mohan reddy

ఎన్నో లక్షల మంది జనాలు ఆ సభలకి తరలివస్తున్నారు. రియాజ్ సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా నెల్లూరు వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఒక ఫోటో కూడా షేర్ చేశారు. సిద్ధం షర్ట్ వేసుకొని రియాజ్ జగన్ ని కలిశారు. దాంతో ఇది చూసిన వాళ్ళందరూ కూడా “అంతకుముందు ట్రోల్ చేసిన వ్యక్తితోనే ఫోటో దిగారు. అసలైన నాయకత్వం అంటే ఇదే. జగన్ అసలైన నాయకుడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రియాజ్ కూడా జగన్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ALSO READ : IPL 2024 : SRH VS CSK మ్యాచ్ లో… కావ్య మారన్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like