భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు బ్రిటన్‌కు కొత్త ప్రధాని పదవి దక్కింది. ఇది చరిత్రలో సరికొత్త రికార్డు అనే చెప్పాలి. మొదట శ్వేతజాతీయేతర వ్యక్తి రిషి సునక్ బ్రిటన్‌కు ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు.

Video Advertisement

 

అయితే రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యాక.. ఆయన భార్య అక్షత మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు. ఎందుకంటే రిషి సునక్ ఈ స్థాయికి రావడానికి ఆమె కృషి కూడా ఉంది. అక్షత..ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్. నారాయణ మూర్తి , సుధా మూర్తి ల కుమార్తె.

rishi sunak, akshatha murthi love story..
లాస్ ఏంజెల్స్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది అక్షత. డెలాయిట్, యూనిలీవర్ కంపెనీల్లో జాబ్ చేసారు. ఆ సమయంలోనే ఎంబీఏ కోసం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చేరినపుడు రిషితో పరిచయం అయింది. నాలుగు సంవత్సరాలు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి వివాహం చేసుకున్నారు. రిషి-అక్షత 2009లో పెళ్లి చేసుకున్నారు. అంటే వారి వివాహం జరిగి 13 సంవత్సరాలు పూర్తైంది. ఈ జంటకు అనౌష్క, కృష్ణ ఇద్దరు కూతుళ్ళు.

rishi sunak, akshatha murthi love story..
అక్షత తన తండ్రి నారాయణమూర్తికి రిషి సునక్ గురించి చెప్పినప్పుడు.. ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. వారి ఇరువురి కుటుంబ నేపథ్యాలు కలవవు అని ఆయన భావించారు. కానీ రిషి సునక్‌తో మాట్లాడిన తర్వాత నారాయణమూర్తి ఆలోచన పూర్తిగా మారిపోయింది. వారి పెళ్లికి ఆయన మనసారా అంగీకరించారు. ఈ విషయాన్ని ‘లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దేర్ డాటర్స్’ అనే పుస్తకంలో నారాయణ మూర్తి రాశారు.

rishi sunak, akshatha murthi love story..
అక్షత అమ్మానాన్నల్లానే సింప్లిసిటీ పుణికి పుచ్చుకుంది. వాళ్ళలానే తన కాళ్ళపై తను నిలబడాలనే ఆశయంతో తను చదివిన ఫ్యాషన్ రంగంలోనే వ్యాపార వేత్తగా నిలదొక్కుకుంది. తన వ్యాపారంలో భాగంగా భారతీయ సంప్రదాయ వస్త్రాలను విదేశాలకు పరిచయం చేస్తుంది. ఇద్దరు బిడ్డలకు తల్లిగా, వ్యాపార వేత్తగా రెండు పాత్రలను పోషిస్తున్న అక్షత ఇప్పుడు ప్రధాని భార్యగా కూడా అందరి మన్ననలూ అందుకుంటుందని ఆశిద్దాం.