Ads
ఒక మనిషి ఎంటర్టైన్మెంట్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటున్నారు.
Video Advertisement
ఈ విషయం పక్కన పెడితే, సోషల్ మీడియా అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది సినిమాలు. సినిమాల గురించి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంది. కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఉన్న సీన్స్ ఎక్కడైనా మరో సినిమాలో కనిపిస్తే.. అది కాపీ చేశారు అంటూ వీడియోస్ కూడా సోషల్ మీడియా లోనే కనిపిస్తూ ఉంటాయి.
ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రోబో సినిమాలో మనం చూసిన చాలా సినిమాలో మరొక పాత సినిమాలో ఉన్న సీన్స్ ఒకటే. శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా నటించిన సినిమా రోబో. ఈ సినిమా అప్పట్లో ఎంత రికార్డ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. సౌత్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చేలా చేసిన మొదటి సినిమా ఇది. ఎన్నో అవార్డులను కూడా ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా కొద్ది సంవత్సరాల క్రితం వచ్చింది.
అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ అంతకుముందు విడుదలైన ఒక సినిమాలో కొన్ని సీన్స్ కి దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమాలోని కొన్ని ముఖ్య మైన సీన్స్ ఘటోత్కచుడు సినిమాలోని కొన్ని సీన్స్ కి దగ్గరగా ఉన్నాయి. ఘటోత్కచుడు సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రోబో సినిమాలోని కొన్ని సీన్స్ కి దగ్గరగా ఉంటాయి. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో ఒక పేజ్ పోస్ట్ చేసింది. తర్వాత వీడియో వైరల్ అయ్యింది. దాంతో చాలా మంది నెటిజన్లు కూడా రెండు సినిమాల్లో సీన్స్ దగ్గరగా ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.
watch video :
End of Article