Home Filmy Adda జబర్దస్త్ లో “రాకెట్ రాఘవ” కొడుకు “మురారి” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

జబర్దస్త్ లో “రాకెట్ రాఘవ” కొడుకు “మురారి” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..??

by Anudeep

జబర్దస్త్ కామెడీ షోలో రాకెట్ రాఘవ చాలా కాలంగా చేస్తున్నాడు. ఈ షో ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోగా ప్రారంభం నుంచి ఉన్నవారిలో రాఘవ ఒకరు. అప్పట్లో వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర టీముల్లో రాకెట్ రాఘవ టీం కూడా ఉండేది. ప్రస్తుతం వారంతా జబర్దస్త్‌ను వీడగా రాఘవ మాత్రం సినిమాల్లో ఛాన్స్ వస్తే అక్కడ చేస్తూనే ఇక్కడ కూడా కొనసాగుతున్నాడు.

అయితే ఈ మధ్యన రాకెట్ రాఘవ కొడుకు మురారి తెగ ఫేమస్ ఐపోయాడు. మురారి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ లో కామెడీ చేస్తున్నారు. డైరెక్ట్ గా తన తండ్రి రాకెట్ రాఘవపైనే పంచులు పేలుస్తూ.. ఆడియన్స్ ను నవ్విస్తున్నారు. ఇక తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఓ సెలెబ్రిటీ రేంజ్ లో సెటిల్ అయ్యాడు మురారి.

రాఘవ కొడుకు మురారి జబర్దస్త్‌లో బుల్లి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు. తొలుత అందరూ గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ మనోడి కామెడీకి ప్రేక్షకులు కూడా వెల్ కమ్ చెప్పారు. దీంతో అటు శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్‌లో మురారి అలరిస్తున్నాడు.

rocket raghava son remunaration for jabardasth..

టీమ్ లో ఉండే అందరిపై కామెడీ టైమింగ్ పంచులు పేలుస్తున్నారు. మురారి ఏ టీంలో చేసినా కానీ తనదైన శైలిలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అందరిపై పంచ్ లు వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.ఇక తన తండ్రి రాఘవ స్కిట్ చేస్తే కనుక తన తండ్రిపై వరుస పంచ్ డైలాగులు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తుంటారు.

rocket raghava son remunaration for jabardasth..
అయితే రాఘవ కొడుకు మురారికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. మురారి స్కిట్ లో కనిపిస్తే చాలు దాదాపు 5000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తన రోల్ కాస్త ఎక్కువగా ఉంటే పదివేల వరకు తీసుకుంటున్నారట. అలాగే ఇంత చిన్న వయస్సులో మురారికి ఉన్న క్రేజ్ కూడా చాలా గ్రాండ్ లెవెల్ లో ఉంది. మురారి స్కిట్స్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.

You may also like