“రోజా, సెల్వమణి” పెళ్లి ఫోటోలు చూశారా..? వారి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?

“రోజా, సెల్వమణి” పెళ్లి ఫోటోలు చూశారా..? వారి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?

by kavitha

Ads

సీనియర్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ మినిస్టర్ గా ఉన్న రోజా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్ గా రాణించారు. 90 లలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

Video Advertisement

ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 100 కు పైగా చిత్రాలలో నటించి, అలరించారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్న రోజా, 2002 లో కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ కె. సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
రోజా అసలు పేరు శ్రీ లతారెడ్డి. 1972లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో నవంబర్ 17న జన్మించారు. ఆ తరువాత కాలంలో వారి కుటుంబం హైదరాబాద్‌ కు వచ్చారు. రోజా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు. ఆమె ఇండస్ట్రీలో రాకముందు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నారు.
రోజా 1991 లో  ప్రేమ తపస్సు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత సర్పయాగం మూవీలో నటించింది. 1992 లో ఆర్ కె. సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి అనే మూవీ ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రాలు విజయం సాధించడంతో ఆమెకు వరుస సినిమాలలో నటించి, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, జగపతిబాబు, వినోద్ కుమర్, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించింది. రజినికాంత్, శరత్ కుమార్, సత్యరాజ్, విజయ్ కాంత్, అర్జున్ సర్జా, మమ్ముట్టి, ప్రభుదేవా వంటి వారితో నటించి మెప్పించింది. 1991 నుండి 2002 వరకు హీరోయిన్ గా నటించింది. 2002 లో ఆగస్ట్ 21న కోలీవుడ్ దర్శకుడు ఆర్ కె. సెల్వమణిని వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రోజా, సెల్వమణి వెడ్డింగ్ ఫోటోలను మీరు చూసేయండి..

1.
2.

3. 
4.
Also Read: ముందు ఏమో అలా.. తరువాత ఇలా..! “సప్త సాగరాలు దాటి” సినిమాలో ఇది గమనించారా..?

 

 


End of Article

You may also like