కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ‘చార్లీ’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి నటించిన “సప్తసాగరదాచే ఎల్లో” మూవీ రిలీజ్ అయ్యి, కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ సాధించి, క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా కూడా నిలిచింది.

Video Advertisement

అక్కడ హిట్ అయిన ఆ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో తెలుగులో సెప్టెంబర్ 22 న రిలీజ్ చేశారు. తొలి షోతోనే మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ర‌క్షిత్ శెట్టి, రుక్మిణి వ‌సంత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన క‌న్న‌డ సినిమా స‌ప్త సాగ‌ర దాచే ఎల్లో. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స‌ప్త సాగ‌రాలు దాటి పేరుతో తెలుగులోకి డ‌బ్ చేసి, రిలీజ్ చేశారు. డైరెక్టర్ హేమంత్ రావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందించారు. రెండవ పార్ట్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ మూవీ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 22 న రిలీజ్ అయిన స‌ప్త సాగ‌రాలు దాటి మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మను, ప్రియ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో మను జైలుకు వెళ్తాడు. అప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలైన అయిన హీరో కోసం వేచి చేస్తా అని చెప్తుంది.
sapta sagaralu dhaati side a movie review కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరోయిన్ హీరో కోసం ఎదురుచూస్తా అని  చెప్పే డైలాగ్ కు సంబంధించిన వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మరి వెయిట్ చేసిందా’ అంటూ షేర్ చేశారు.  ఆమె ముందు హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: రెండు భాషల్లో రీమేక్, ఇంకొక భాషలో డబ్బింగ్… కానీ ఈ సినిమాని కొట్టేదే లేదు..! ఈ సినిమా చూశారా..?