Romantic Review : “ఆకాష్ పూరి”కి మొదటి హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Romantic Review : “ఆకాష్ పూరి”కి మొదటి హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : రొమాంటిక్
  • నటీనటులు : ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణన్.
  • నిర్మాత : పూరి జగన్నాధ్
  • దర్శకత్వం : అనిల్ పాదూరి
  • సంగీతం : సునీల్ కశ్యప్
  • విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021

romantic movie review

Video Advertisement

స్టోరీ : 

సినిమా గోవాలో మొదలవుతుంది. రమ్య గోవారికర్ (రమ్య కృష్ణన్) పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తుంది. వాస్కో డా గామా (ఆకాష్ పూరి) ఒక చిన్న స్మగ్లర్. గోవాలో ఉన్న ఒక రౌడీ గ్యాంగ్ లో చేరుతాడు. తర్వాత అతను చేసిన పనులు ఏంటి? వాటివల్ల ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? అనేది స్టోరీ. వాస్కో డా గామా కి, మౌనిక (కేతిక శర్మ) ఎలా పరిచయం అవుతుంది? వారిద్దరి ప్రేమ కథ ఏంటి? చివరికి వారిద్దరూ కలిసారా? తను చేసిన పనుల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి ఎలా బయట పడ్డాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

romantic movie review

రివ్యూ :

2018 లో వచ్చిన మెహబూబా సినిమా తర్వాత, మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని రొమాంటిక్ సినిమాతో మనముందుకు వచ్చారు ఆకాష్ పూరి. నటన పరంగా ఆకాష్ చాలా డెవలప్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్ ని కూడా చాలా సులభంగా చేశారు. చిన్నప్పటినుంచి నటిస్తున్న కారణంగా, ఆకాష్ ఎక్కడా భయపడకుండా చాలా ఓపెన్ గా నటించారు. హీరోయిన్ కేతిక శర్మ కూడా మొదటి సినిమా అయినా సరే చాలా బాగా చేశారు. హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన దేవియాని శర్మ, సినిమాకి మరో హైలైట్ గా నిలిచారు. అలాగే ముఖ్య పాత్ర పోషించిన రమ్య కృష్ణన్, సహాయ పాత్రలో నటించిన ఉత్తేజ్, మకరంద్ దేశ్ పాండే, సునైనా వీరందరు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

romantic movie review

ఈ సినిమాలో పూరి జగన్నాధ్ టెంప్లేట్ స్టైల్, సీన్స్, డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ, ఎక్కడో పూరి మార్క్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. హార్ట్ ఎటాక్, 143 సినిమా షేడ్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. సునీల్ కశ్యప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సీన్స్ ఇంకా ఎలివేట్ అయ్యాయి. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, సాంగ్స్ చిత్రీకరించిన విధానం కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ అనిల్ కూడా, కథ స్క్రీన్ మీద ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రెజెంట్ చేశారు. ఇది అనిల్ కి మొదటి సినిమా అయినా కూడా, రొమాంటిక్ చూస్తున్నంత సేపు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీసిన సినిమాలాగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
  • డైలాగ్స్
  • ఎలివేషన్స్

మైనస్ పాయింట్స్:

  • ఎక్కడో మిస్ అయిన పూరి మార్క్
  • అంతకు ముందు చూసిన కొన్ని సినిమాల్లోని సీన్స్

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

సినిమా చూస్తున్నప్పుడు కొన్ని పూరి జగన్నాధ్ పాత సినిమాలు గుర్తొస్తాయి. ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అయినా కూడా, ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఆసక్తికరంగా ఉండటంతో, రొమాంటిక్ ఒక డీసెంట్ సినిమాగా నిలుస్తుంది.


End of Article

You may also like