RRR: బాహుబలి 2 రికార్డ్స్ ని బీట్ చేసిన RRR.. ఎక్కడో తెలుసా?

RRR: బాహుబలి 2 రికార్డ్స్ ని బీట్ చేసిన RRR.. ఎక్కడో తెలుసా?

by kavitha

Ads

Tollywood: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రాల తరువాత  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమా స్టామినాని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఏడాది మార్చిలో మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ సందడి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
rrr-bahubali-telugu-addaఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్‌‌లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్‌గా జపాన్‌ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
rrr-1 telugu addaఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్‌లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
rrr-2 telugu addaఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

Video Advertisement


End of Article

You may also like