టాలీవుడ్ లో ఇటీవల సంచలనం సృష్టించిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. జక్కన్న చెక్కిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

Video Advertisement

 

ఇటీవలే ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా సమయంలో రాజమౌళి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. ఇక జపాన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

RRR craze in japan..

అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ జపాన్ లో ఈ సినిమా క్రేజ్ కి నిదర్శనం అంటూ ఒక పిక్ ని షేర్ చేసారు. దాంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ సినిమాను చూడటానికి కొంతమంది ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ ఫ్యాన్స్ ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

RRR craze in japan..

ఈ సినిమా జపాన్ లో విడుదలై చాలారోజులే అయినా అక్కడి థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రాజమౌళి, తారక్, చరణ్ జపాన్ కు వెళ్లి ఈ సినిమా ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

RRR craze in japan..

ఇప్పటికే అక్కడ విడుదలైన ఇండియన్ సినిమాలన్నింటిలో టాప్ మూవీగా నిలిచింది. తాజాగా 2 మిలియన్ వసూళ్లను దాటి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఆర్ఆర్ఆర్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.