RRR మొట్ట మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..? బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిందిగా..!

RRR మొట్ట మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..? బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిందిగా..!

by Anudeep

Ads

ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఇప్పటి వరకు రిలీజ్ పై ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవడంతో ఇంకా సందేహాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాపై భారీ గానే అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.. దానికి తగ్గట్లే ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. మొట్ట మొదటి రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్స్ ను ఓ సారి పరిశీలిద్దాం.

నైజాం – 23.30 కోట్లు.
సీడెడ్ – 17.00 కోట్లు
ఉత్తరాంధ్ర – 07.40 కోట్లు
ఈస్ట్ – 05.35 కోట్లు
వెస్ట్ – 05.93 కోట్లు
గుంటూరు 07.80 కోట్లు
కృష్ణా 04.20 కోట్లు
నెల్లూరు 03.10 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్) 73.99 కోట్లు
తమిళ్ నాడు 04.92 కోట్లు
కేరళ 01.71 కోట్లు
కర్ణాటక 08.13 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) 09.25 కోట్లు
ఓవర్సీస్ 34.00 కోట్లు
రెస్ట్ 03.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 135.50 కోట్లు

బాహుబలి సినిమా రికార్డు లను ఆర్ ఆర్ ఆర్ సినిమా తిరగరాసింది. గ్రాస్ పరంగా రూ.236 కోట్లను కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ.. హిందీ లో ఒక్క చోటే బాహుబలి 2 రికార్డు ను క్రాస్ చేయలేకపోయింది.


End of Article

You may also like