Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.
సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. కొంత మంది కథ ముందుకు వెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించారు. వారిలో మల్లి ఒకరు. మల్లి పాత్ర పోషించిన అమ్మయి పేరు ట్వింకిల్ శర్మ. మల్లి సినిమాలో కొమ్మ ఉయ్యాలా అనే ఒక పాట పాడుతుంది. ఆ పాట ఆల్బమ్‌లో లేదు. సినిమాలో విన్నప్పుడు ప్రేక్షకులకి ఆశ్చర్యంగా అనిపించింది. సినిమాలో పాడింది మల్లి అయినా కూడా, రియల్‌గా ఈ పాట పాడిన అమ్మాయి పేరు ప్రకృతి రెడ్డి.
ప్రకృతి రెడ్డి తారే జమీన్ పర్ అనే ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా పాల్గొంది. అలాగే తెలుగులో సరిగమప లిటిల్ చాంప్స్ ప్రోగ్రాం లో కూడా పాల్గొంది ప్రకృతి. అలా ప్రకృతి కీరవాణి దగ్గర పాడే ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రకృతి ఈ పాట పాడింది. ప్రకృతికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో పాటలను పాడి వీడియోలని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.
End of Article