Ads
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఒకటి. ఈ భారీ మల్టీస్టారర్ మూవీ గత ఏడాది మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి, సంచలనం సృష్టించింది. ఇండియాకి స్వతంత్రం రావడానికి ముందు జరిగిన స్టోరీ ఆధారంగా రూపొందించారు.
Video Advertisement
చరిత్రలో ఒకరికొకరు కలవని ఇద్దరు యోధులు అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలవడం, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడితే ఎలా ఉంటుందనే కథతో రాజమౌళి తెరకెక్కించారు. ఈ మూవీలోని నాటు నాటు పాట గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో తాజాగా వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆడియెన్స్ మనసులను హత్తుకుంది. ఈ చిత్రంలో సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించారు. జక్కన్న 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్ గా చాటి చెప్పింది. ఈ సినిమాను చూసి హాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు కూడా జక్కన్న దర్శక ప్రతిభకు మెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ లో కూడా పలు అవార్డులను అందుకుందిసినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అందుకుంది. నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ను ఉరూతలూగించింది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ పనిచేశారు. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారింది.నాటు నాటు పాటలోని పాపులర్ స్టెప్స్ ని కోలీవుడ్ స్టార్ హీరో మూవీ నుండి కాపీ చేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టార్ హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. విజయ్ 1996లో ‘కోయంబత్తూరు మాపిళ్ళై’ అనే సినిమాలో నటించారు. హీరోయిన్ గా సంఘవి నటించారు. ఇక ఆ సినిమాలో ఒక పాటలో విజయ్ చేసిన స్టెప్స్, జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టెప్స్ ఒకేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/p/Crm43XCvVNX/
End of Article