Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు. కొంత మంది కథ ముందుకు వెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషించారు. వారి వల్లే సినిమాలో చాలా ట్విస్ట్‌లు వచ్చాయి. సినిమాలో కొన్ని సీన్స్ వేరే సినిమాల నుండి ఇన్స్పైర్ అయ్యి చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 సినిమాలో రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తారు. ఆ సీన్ అవెంజర్స్ సినిమా నుండి తీసుకున్నారు.
#2 క్లైమాక్స్ ముందు వచ్చే ఫైటింగ్ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మీద ఎక్కి దూకుతారు. ఈ సీన్ కుంఫు పాండా సినిమాలోని ఒక సీన్ కి దగ్గరగా ఉంటుంది.
#3 జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ 10000 BC సినిమా నుండి తీసుకున్నారు.
#4 జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ ఒకరు బైక్ మీద ఒకరు గుర్రం మీద వెళుతూ ఉంటారు. ఈ సీన్ ఘోస్ట్ రైడర్ సినిమాలోని ఒక సీన్ కి దగ్గరగా ఉంటుంది.
#5 అలాగే అల్లూరి సీతారామరాజు జైలు సీన్ చూస్తే చిరంజీవి హీరోగా నటించిన వేట సినిమా గుర్తొస్తుంది.
#6 జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు పట్టుకోవడం స్టార్ వార్స్ – ద ఓల్డ్ రిపబ్లిక్ సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు.
#7 అలాగే కొమరం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ విలన్ల ఇంటి మీదకి దూకే సీన్ టార్జాన్ సినిమా నుండి తీసుకున్నారు.
#8 ఒక పిల్లతో పాట పాడించడం, ఆ పిల్లని తీసుకెళ్లడం, ఆ పిల్ల కోసం వెతకడం అనేది రాజశేఖర్ నటించిన పాప కోసం సినిమా కాన్సెప్ట్ కూడా కొంచెం కొంచెం దగ్గర దగ్గర ఇలాగే ఉంటుంది.
#9 లేడీ స్కాట్ కొమరం భీముడో పాట సమయంలో అనే డైలాగ్స్ కూడా మైకేల్ జాక్సన్ పాటైన రిమెంబర్ ద టైం పాట గుర్తొస్తుంది.
#10 అజయ్ దేవగన్ చనిపోయే సీన్ జీరో డార్క్ 30 సినిమా గుర్తొస్తుంది.
ఇది మాత్రమే కాకుండా మన్యం పులితో పాటు ఇంకా కొన్ని సినిమాల రిఫరెన్స్ కూడా సినిమాలో కనిపిస్తూ ఉంటుంది.
watch video :
https://youtu.be/Q-yiprMmXcY
End of Article