Ads
కెరియర్ లో సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు కిరణ్ అబ్బవరం. యూత్ లో అతనిపై ఎంత మంచి అభిప్రాయం ఉందంటే వరుస పెట్టి సినిమాలో ఫ్లాప్ అవుతున్న నెక్స్ట్ సినిమాకి అటెన్షన్ పెడుతున్నారు యూత్. అయితే ఈసారి కూడా యూత్ ని ఆకర్షించలేకపోయాడు కిరణ్ అబ్బవరం. థియేటర్ రిలీజ్ కి ముందు ఈ చిన్న సినిమాపై మంచి క్రేజ్ వుంది. దీంతో ఈ మూవీ ఓటిటి రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది.ఐతే ఎంతో హైప్ తో విడుదలైన రూల్స్ రంజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Video Advertisement
సినిమాలో చూపించిన లవ్ స్టోరీ లో కొత్తదనం లేకపోవడం, కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవటంతో రూల్స్ రంజన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీక్ లోనే థియేటర్ నుంచి బయటికి వచ్చేసింది. అయితే ఓటీటీ లో మాత్రం తన సత్తాని ఒక రేంజ్ లో చూపిస్తుంది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీమాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తో కొనసాగుతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఆహా లో 72 మిలియన్ నిమిషాలు కి పైగా స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్ ని సంపాదించుకుంటుంది.
సిల్వర్ స్క్రీన్ మీద కాకపోయినా ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు మూవీ మేకర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం కాగా హీరోయిన్లుగా నేహా శెట్టి, మెహర్ చాహల్ నటించారు. వీరితోపాటు హర్ష చెముడు, సుబ్బరాజు, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాని ఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లావణ్య, మురళీకృష్ణ వేమూరి నిర్మించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం చేతిలో ఇప్పటికీ మూడు సినిమాలు ఉన్నాయి అదీ యూత్ లో అతనికి ఉన్న క్రేజ్.
End of Article