Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ఆది పురుష్. ఈ మూవీ రామాయణం ఆధారంగా రూపొందిన పౌరాణిక చిత్రం.
Video Advertisement
ఇప్పటికే చాలా సార్లు వాయిదాపడిన ఈ మూవీని ఈ నెల 16న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈమూవీ చూసే సమయంలో పాటించాల్సిన నియమాలు అనే వాట్సాప్ మెసేజ్ వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజువల్ వండర్ గా రూపొందిన ‘ఆది పురుష్’ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించిగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్. హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రదర్శించే ధియేటర్లలో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం కేటాయిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీనిపై కొందరు ప్రమోషనల్ స్టంట్ అని అంటే, కొందరు శ్రీరాముడి కథ చెప్తున్నప్పుడు ఆంజనేయస్వామి కోసం సీటు వదిలితే తప్పు ఏమిటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో రక రకాల చర్చలు జరుగుతున్న క్రమంలో తాజాగా వాట్సాప్ మెసేజ్ ఒకటి వైరల్ గా మారింది. ఆదిపురుష్ సినిమా చూసే సమయంలో పాటించాల్సిన నియమాలు అంటూ వాట్సాప్ గ్రూప్ లలో తిరుగుతోంది. ఆ నియమాలు ఇవే..
- మద్యం తాగి థియేటర్ కి వెళ్ళకూడదు.
- పాదరక్షలు వేసుకొని థియేటర్ కి వెళ్ళకూడదు.
- మాంసాహారం తిన్న తరువాత థియేటర్ కి వెళ్ళకూడదు.
- థియేటర్ బయట, లోపల జై శ్రీరామ్ తప్ప నటుడి పేరు కానీ సినిమాలోని ఇతర పాత్రలకి జేజేలు కొట్టకూడదు.
- వీలయితే మూవీ ప్రదర్శించే స్క్రీన్ ముందు ఇబ్బంది కలగకుండా అందరూ కొబ్బరి కాయలు కొట్టండి.
- కుదిరితే టీ షర్ట్ జీన్స్ లాంటివి వేసుకోకుండా పైన తెల్లటి లేదా కాషాయపు బట్టతో కప్పుకొని కింద పంచ కట్టుకొని వెళ్ళాలి.
- హనుమంతుడికి కేటాయించిన చైర్ పూలమాలలతో, ధూప, దీప నైవేద్యాలతో అలంకరించండి.
- జై శ్రీరామ్ నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి
Also Read: “ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా..?” అంటూ… “ప్రభాస్” ఫ్యాన్స్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
End of Article