Ads
విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాగా సైంధవ్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన పాటలు విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక టాప్ వినిపిస్తుంది. సైంధవ్ మూవీ కథ ఇదే అంటూ చర్చించుకుంటున్నారు.
Video Advertisement
ఈ మూవీ గతంలో గోపీచంద్ నటించిన మూవీకి దగ్గరగా ఉందని టాక్ వినిపిస్తుంది. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు మూవీ గురించి తెలిసిందే.ఆ సినిమాలో బాంబే బ్లడ్ కోసం హీరోని చంపడానికి విలన్ మహేష్ మంజ్రేకర్ ముఠా వెంటపడుతుంది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా అనిపించినా… సెకండాఫ్‌లో కన్‌ఫ్యూజ్, బోరింగ్ లాంటివి వచ్చి ఫలితం తేడా కొట్టింది
పాపను బ్రతికించుకోవడానికి అవసరమైన ఒక ఇంజెక్షన్ చుట్టూ ‘సైంధవ్’ సినిమా కథ తిరుగుతుందని టాక్. ఆ ఇంజిక్షన్ ధర రూ.15 కోట్లకు పై మాటే అంటున్నారు. దీని గురించే హీరోకు, విలన్‌కు మధ్య వార్ జరుగుతుందట. ఇప్పుడు శైలేష్ తీస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా కథను కనెక్టింగ్‌గా తీస్తే ఈసారి మంచి ఫలితం రావొచ్చు. సంక్రాంతికి చాలా సినిమాలు పోటీలో ఉన్న కూడా సైంధవ్ చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వస్తుంది.
End of Article