ఉక్రెయిన్ ఆర్మీకి ఉపిరిపోస్తున్న ఒకే ఒక్క కుక్క.. పుతిన్ సైన్యానికి చుక్కలు చూపెడుతోందిగా..!

ఉక్రెయిన్ ఆర్మీకి ఉపిరిపోస్తున్న ఒకే ఒక్క కుక్క.. పుతిన్ సైన్యానికి చుక్కలు చూపెడుతోందిగా..!

by Anudeep

Ads

అనారోగ్యంగా ఉన్న కారణంతో ఈ కుక్కని రష్యా సైనికులు వదిలేశారు. అప్పటివరకు ఈ కుక్కని తమ సైన్యంలో వాడుకుని.. తరువాత ఆరోగ్యం బాగోని కారణంగా ఆ కుక్కని ఉక్రెయిన్ లోనే వదిలేసారు. అయితే.. ఈ కుక్కని చూసిన ఉక్రెయిన్ ఆర్మీ జాలి పడింది.

Video Advertisement

వెంటనే ఈ కుక్కని తీసుకెళ్లి సపర్యలు చేసారు. దానికి మందులు ఇచ్చి..మంచి ఆహారాన్ని కూడా పెట్టారు. సహజంగా విశ్వాస జంతువైన ఈ జాగిలం ఉక్రెయిన్ ఆర్మీ కి అనుకూలంగా మారింది.

russian dog

ఉక్రెయిన్ ఆర్మీ పెట్టిన పోషకాహారం తింటూ మంచిగా బలిష్టంగా అయ్యింది. ఒకప్పుడు ఇది రష్యా సైనికులు చెప్పినట్లు చేసేది. కానీ.. ఉక్రెయిన్ సైనికులు ఈ కుక్కకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి.. దాని మైండ్ సెట్ ను మార్చేశారు. ఉక్రెయిన్ సైనికులు నుంచుమంటే నుంచుంటుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి అలా ట్రైనింగ్ ఇచ్చి మార్చేశారు. ఇప్పుడు ఇది ఉక్రెయిన్ ఆర్మీలో చేరిపోయింది. రష్యన్ బలగాలు పెట్టిన మందు పాతరలను సులువుగా గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంలో ఉక్రెయిన్ ఆర్మీకి సాయం చేస్తోంది. పుతిన్ ఆర్మీకి ముచ్చెమటలు పోయిస్తోంది.


End of Article

You may also like