Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Video Advertisement
ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాలోని సామీ సామీ అనే పాట ఇటీవల విడుదల అయ్యింది.ఈ పాటని దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచగా, తెలుగులో మౌనిక యాదవ్ పాడారు.
మౌనిక యాదవ్ కరీంనగర్ జిల్లా కనపర్తి చెందినవారు. ఆరో తరగతి వరకు చదువుకున్నారు. మౌనికకి ఒక అక్క ఉన్నారు. మౌనిక అక్క పద్మావతి జానపద పాటలు పాడేవారు. మౌనిక తండ్రికి తెలిసిన ఒక కళాకారుడు పద్మావతి పాట బాగుంది అని మెచ్చుకున్నారు. దాంతో పద్మావతికి వేదికల మీద పడటం నేర్పించారు. పద్మావతితో పాటు మౌనిక కూడా వెళ్లేవారు. 2009లో తెలంగాణ ఉద్యమం ప్రజా చైతన్య యాత్రలో మౌనిక పాట పాడారు. అప్పటినుంచి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా మౌనిక చేత ఆ పాట పాడించేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం సంపాదించారు. మౌనిక పాడిన పాటలు యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాయి.
గత సంవత్సరం నవంబర్ లో సుకుమార్ టీం మౌనికతో మాట్లాడి పాట పాడించారు. అయితే మౌనిక ఇంత స్థాయికి రావడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అని చెప్పారు. ఒక సందర్భంలో ప్రోగ్రాంకి వెళ్ళాలి అంటే మౌనిక తల్లి, తన చెవి దుద్దులని తాకట్టు పెట్టి డబ్బు సర్దుబాటు చేశారు. మౌనిక తండ్రి కూడా తన పనులు అన్ని పక్కన పెట్టి మౌనిక, పద్మావతిని ప్రోగ్రామ్స్ కి తీసుకొని వెళ్ళేవారు. ఇదంతా మౌనిక ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మౌనిక మనందరికీ సుపరిచితురాలు అయ్యింది సామీ సామీ పాటతోనే. కానీ ఆ పాట వెనకాల చాలా కష్టం ఉంది.
Mounika Yadav Songs :
Watch video :
Watch Video :
End of Article