డబ్బు సంపాదిస్తే పెళ్లికి ఒప్పుకుంటారని దుబాయ్ కి వెళ్లారు ప్రియుడు…చివరికి ప్రేయసి.?

డబ్బు సంపాదిస్తే పెళ్లికి ఒప్పుకుంటారని దుబాయ్ కి వెళ్లారు ప్రియుడు…చివరికి ప్రేయసి.?

by Anudeep

Ads

ప్రేమ విషయం లో ఒక్కొక్కళ్ళు ఒక్కో నిర్వచనం చెబుతుంటారు. కానీ అర్ధం చేసుకోవడం తో పాటు మెచూరిటీ తో ఆలోచిస్తూ మసలుకుంటేనే ఏ ప్రేమ జీవితం అయిన నిలుస్తుంది. క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ సార్లు నష్టాన్నే కలిగిస్తాయి. అలాంటి నష్టం ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఒకరి కోసం ఒకరు అనాలోచితం గా ప్రాణాలు తీసుకున్నారు.

Video Advertisement

source: news18

గోవిందు పల్లి కి చెందిన మనీషా, రాకేష్ లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే, ఎక్కువ డబ్బులు సంపాదిస్తే.. వారి వివాహానికి ఇంట్లో పెద్దలు అభ్యంతరం చెప్పకుండా ఉంటారు అని భావించి రాకేష్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు. దుబాయ్ కి వెళ్తే.. తక్కువ టైం లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని అతని సన్నిహితులు చెప్పడం తో.. అతను దుబాయ్ కి వెళ్ళాడు. అక్కడకి వెళ్లిన తరువాత కూడా వీరిద్దరూ ఒకరినొకరు మర్చిపోలేదు. రాకేష్ రోజు మనీషా తో ఫోన్ మాట్లాడేవాడు. కానీ.. వీరి కథ సుఖంతమవ్వలేదు.

ఇంతలో మనీషా తల్లి తండ్రులు ఆమె కు మరో సంబంధం చూడడం తో ఆమె బాధ భరించలేకపోయింది. తాను మరొకరిని ప్రేమించినట్లు తల్లితండ్రులకు చెప్పలేక, తన ప్రియుడిని మోసం చేసి మరోవ్యక్తిని పెళ్ళాడలేక నలిగిపోయింది. క్షణికావేశం లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం దుబాయ్ లోని రాకేష్ కు కూడా తెలియడం తో తీవ్ర దిగ్బ్రాంతి చెందాడు. అతను కూడా ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆత్మహత్య కు పాల్పడే ముందు ఓ సెల్ఫీ వీడియో ను తీసుకున్నాడు..

“నా కోసమే తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని.. తాను లేని ఈ లోకం లో నేను కూడా బతకలేనని.. తాను కూడా ఈ లోకం వీడిపోతున్నట్లు చెబుతూ ఓ సెల్ఫీ వీడియో ను తీసుకుని తన తల్లికి పంపాడు. క్షణికావేశం లో వారు తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాలను క్షోభ పెట్టింది. వారు మనసులోనే మధనపడడం మాని, విషయం తల్లి తండ్రులకు చెప్పి ఉంటె పరిస్థితి మరోలా ఉండేదని ఇరు కుటుంబాలకు తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా విషయం మనలని కలవరపెడుతున్నపుడు మనం దానిని తలుచుకుని కుమిలిపోవడం కంటే.. ఎదుటివారితో చర్చించడమే మేలు.


End of Article

You may also like