Ads
మరణం ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లిపోతుందో చెప్పలేం.. అందుకే నూకలున్నంత వరకే జీవితం అంటుంటారు. తాజాగా.. కొత్తగా పెళ్లి చేసుకున్న రోజుల గడువులోనే నవ వధువు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది. ఈ ఘటన కుటుంబం లోను, బంధువుల్లోనూ.. స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. నాగర్ కర్నూల్ కు చెందిన శ్రీవాణికి, తాండూరు కు చెందిన నవీన్ కు పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ నెల 14 న ఈ వివాహం జరిగింది. బంధుమిత్రులంతా కలిసి భోజనాలు చేశారు.
Video Advertisement
ఆ మరునాడు వధూవరులిద్దరూ కలిసి ఆలయం లో అభిషేకం చేసారు. ఆ తరువాత ఇంటికి చేరుకున్నారు. అప్పటినుంచి శ్రీవాణి కి అస్వస్థత చేకూరింది. ఉన్నట్లుండి వాంతులు చేసుకోవడం తో అందరిలోనూ కంగారు మొదలైంది. మరికాసేపటికి శ్రీవాణి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూనే శ్రీవాణి మరణించింది. ఆమెకు కరోనా సోకినా పట్టించుకోకుండా పెళ్లి చేసారంటూ ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. కానీ, అలసట, నిద్ర లేకపోవడం, సరిగ్గా తినకపోవడం వలనే ఆమెకు బిపి డౌన్ అయి మరణించిందని తల్లి తండ్రులు చెబుతున్నారు.
End of Article